AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: బాబు బర్త్ డే వేళ ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్

ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా నిరుద్యోగులకు సర్కార్ తీపికబురు చెప్పింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆన్‌లైన్ దరఖాస్తు విధానం కూడా ప్రారంభమైంది. సో నిరుద్యోగులు...కమాన్‌, గెట్‌రెడీ.. తెరవండి పుస్తకాలు.. చదివేయండి సిలబస్‌లు. ఎందుకంటే మెగా DSC వచ్చేసింది. 16వేలకు పైగా కొలువులను మోసుకొచ్చింది.

Andhra: బాబు బర్త్ డే వేళ ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్
CM Nara Chandrababu Naidu
Ram Naramaneni
|

Updated on: Apr 20, 2025 | 7:06 PM

Share

కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన నిరుద్యోగులకు ఎట్టకేలకు శుభ తరుణం వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువుల నియామకాలకు సంబంధించిన మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఉదయం విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా కూటమి సర్కార్ డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 16,347 స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులందరూ ఈ పోస్టులకు పోటీ పడవచ్చు. అలాగే అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఎక్కువ మంది ఈ పోస్టులకు పోటీ పడేందుకు అవకాశం లభించింది.

మే 15వరకు దరఖాస్తులు

ఈ మెగా డీఎస్సీ షెడ్యూల్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ శనివారం ‘ఎక్స్‌’ ద్వారా విడుదల చేశారు. ఏప్రిల్‌ 20 నుంచి మే 15వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మే 20 నుంచి నమూనా పరీక్షలు నిర్వహిస్తారు. మే 30 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జూన్‌ 6 నుంచి జూలై 6 వరకు సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నామని మంత్రి నారా లోకేష్‌ చెప్పారు. డీఎస్సీ అభ్యర్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు లోకేష్. అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక ‘కీ’ విడుదల చేస్తారు. ఆ తర్వాత ఏడు రోజులపాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుది ‘కీ’ విడుదల చేస్తారు. ఆ తర్వాత వారం రోజులకు మెరిట్‌ జాబితా ప్రకటిస్తారు.

మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్ష షెడ్యూల్‌, సిలబస్, సహాయ కేంద్రాల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

Follow Us
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ.. దివాళా తీయడానికి కారణమేంటి?
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ.. దివాళా తీయడానికి కారణమేంటి?
భారత్ కు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్
భారత్ కు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్
6 గ్యారంటీ హామీలపై విపక్షాల రాజకీయ యుద్ధం..
6 గ్యారంటీ హామీలపై విపక్షాల రాజకీయ యుద్ధం..
ఖాళీ కడుపుతో నానబెట్టి తింటే ఏది ఎక్కువ శక్తివంతమైనది?
ఖాళీ కడుపుతో నానబెట్టి తింటే ఏది ఎక్కువ శక్తివంతమైనది?
ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం
ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం
అమ్మమ్మను విమానం ఎక్కించిన మనవరాలు! పైలట్ చేసిన ఎమోషనల్ అనౌన్స్‌
అమ్మమ్మను విమానం ఎక్కించిన మనవరాలు! పైలట్ చేసిన ఎమోషనల్ అనౌన్స్‌
బాత్‌రూమ్ మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది.. ఈ రహస్యాలు పాటిస్తే..
బాత్‌రూమ్ మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది.. ఈ రహస్యాలు పాటిస్తే..
అంత్యక్రియలకు కూడా డబ్బులేని దీనస్థితి అనాధగా మరణించింది
అంత్యక్రియలకు కూడా డబ్బులేని దీనస్థితి అనాధగా మరణించింది
తీర్థం తలకు రాసుకుంటున్నారా..? రాగి పాత్రలోనే ఎందుకు ఇస్తారంటే..
తీర్థం తలకు రాసుకుంటున్నారా..? రాగి పాత్రలోనే ఎందుకు ఇస్తారంటే..
ఏసీ కోచ్‌లో ప్రయాణం..బ్యాగులో రైల్వే దుప్పట్లు!పట్టుబడ్డ టూరిస్ట్
ఏసీ కోచ్‌లో ప్రయాణం..బ్యాగులో రైల్వే దుప్పట్లు!పట్టుబడ్డ టూరిస్ట్