AP DSC: డీఎస్సీ అభ్యర్థులు గోల్డెన్‌ ఛాన్స్‌.. కోచింగ్‌తో పాటు స్టయిఫండ్‌..

| Edited By: Narender Vaitla

Nov 16, 2024 | 1:51 PM

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ పరీక్షలకు సిద్దమవుతోన్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించడంతో పాటు కోచింగ్ ఉన్నన్ని రోజులు స్టయిఫండ్‌ కూడా ఇవ్వనున్నారు. ఇందులో భాగంగానే 26 జిల్లా కేంద్రాల్లో ఉన్న బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణ అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది..

AP DSC: డీఎస్సీ అభ్యర్థులు గోల్డెన్‌ ఛాన్స్‌.. కోచింగ్‌తో పాటు స్టయిఫండ్‌..
AP DSC
Follow us on

రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల డీఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది… బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇస్తోంది. శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత కోచింగ్ సెంటర్లు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో ఉన్న 26 జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇవ్వనున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకంగా మెగా డీఎస్సీ నిర్వహణపై సంతకం చేసిన సిఎం చంద్రబాబు 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేంద్రాల ద్వారా డీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యే వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువతకు ఆర్థిక సహకారం ఇస్తూ, సబ్జెక్టుల వారీగా నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణివ్వాలని నిర్ణయించారు.

శిక్షణా సమయంలో స్టయిఫండ్..

బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం చొప్పున సీట్లు కేటాయించారు. వీరితో పాటు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో 10 శాతం సీట్లు కేటాయించారు. 2 నెలల పాటు సాగనున్న ఈ ఉచిత డీఎస్సీ కోచింగ్ సమయంలో అభ్యర్థులకు నెలకు రూ. 1500 రూపాయి చొప్పున స్టయి ఫండ్ ఇవ్వనున్నారు. అలాగే మెటీరియల్ కోసం అదనంగా మరో 1000 రూపాయలు ఇవ్వనున్నారు.

త్వరలోనే ఆన్‌లైన్‌లో కూడా..

ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లోనూ డీఎస్సీ ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఆఫ్ లైన్ లో అవకాశం లభించని వారితో పాటు ఆసక్తి చూపిన వారందరికీ ఆన్ లైన్ లోనూ ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందిస్తున్నారు. ఈ వెబ్ సైట్ లో సబ్జెక్టుల వారీగా నిపుణులైన వారితో క్లాసుల నిర్వహిస్తారు. క్లాసులతో పాటు పాత క్వశ్చన్ పేపర్లు, మోడల్ పేపర్లు కూడా అందుబాటులో ఉంచనున్నారు. బీఈడీ అర్హతతో పాటు టెట్ లో ఉత్తీర్ణత సాధించిన వారికే ఆన్ లైన్, ఆఫ్ లైన్ కోచింగ్ ఇస్తారు. ఆన్ లైన్ అభ్యర్థులకు తమకు వీలున్న సమయాల్లో క్లాసులు వినే అవకాశం కలిగేలా వెబ్ సైట్ ను రూపొందిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..