CM Jagan: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు.. ఎందుకు వెళ్లడం లేదంటే…

|

Sep 24, 2021 | 10:14 PM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన స్థానంలో హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెళ్లనున్నారు.

CM Jagan: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు.. ఎందుకు వెళ్లడం లేదంటే...
Cm Jagan
Follow us on

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన స్థానంలో హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెళ్లనున్నారు. శుక్రవారం ఉదయం వ్యాయామ సమయంలో సీఎం జగన్‌కు కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో సీఎం శనివారం నాటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు.

ఇదిలావుంటే.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుక్ర‌వారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. కేసీఆర్ వెంట ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు వినోద్ కుమార్, ఎంపీ సంతోష్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ప్ర‌త్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన సంగతి  తెలిసిందే. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈ నెల 25న‌ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో కేసీఆర్ స‌మావేశం కానున్నారు. 26న విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తీవ్రవాద ప్రభావిత రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు.

ఇవి కూడా చదవండి: JC vs MLC Jeevan: రాజకీయాలు మాట్లాడాలంటే బయటే చూసుకోవాలి.. జేసీకి క్లాస్ పీకిన ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి..

CM Jagan: వైద్య ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్..