Srisailam Shops Auction:శ్రీశైలం దేవస్థానంలో షాపులకు రేపు వేలం.. అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు..

|

Jun 26, 2022 | 8:44 AM

Srisailam Shops Auction: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శ్రీలలితాంబ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో దుకాణాలకు మరోసారి ..

Srisailam Shops Auction:శ్రీశైలం దేవస్థానంలో షాపులకు రేపు వేలం.. అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు..
Srisailam
Follow us on

Srisailam Shops Auction: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శ్రీలలితాంబ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో దుకాణాలకు మరోసారి బహిరంగ వేలం జరగనుంది. గతంలో నిర్వహించిన వేలాల్లో మిగిలిపోయిన 109 షాపులకు ఈనెల 27న వేలం నిర్వహించనున్నారు. శ్రీశైలం దేవస్థానం నిర్వహించబోయే వేలంలో పాల్గొనేందుకు వందల సంఖ్యలో డీడీలు వచ్చాయ్‌. వేలంలో పాల్గొనబోయేవాళ్లంతా రూల్స్‌ ప్రకారం ఇప్పటికే డీడీలు సబ్‌మిట్ చేశారు. దాంతో, మిగిలిపోయిన 109 దుకాణాలకు రేపు బహిరంగ వేలం నిర్వహించనున్నారు.

శ్రీశైలంలోని శ్రీలలితాంబ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో షాపుల వేలం మొదట్నుంచీ ఉత్కంఠ రేపుతోంది. దుకాణాల తరలింపు, బహిరంగ వేలంపై అనేకసార్లు కోర్టులను ఆశ్రయిస్తుండటంతో వివాదం నడుస్తూ వస్తోంది. అయితే, ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఈనెల 17న వేలం దుకాణాలకు వేలం నిర్వహించినా అడ్డంకులు ఏర్పడ్డాయి. ఆలయం ఎదురుగా ఉండే దుకాణాదారులను శ్రీలలితాంబ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లోకి తరలించేందుకు లక్కీ డీప్‌ నిర్వహించగా 24మంది మాత్రమే పాల్గొన్నారు. మిగతా వ్యాపారులు డీప్‌లో పాల్గొనకపోవడంతో ఇప్పుడు మరోసారి బహిరంగ వేలానికి సిద్ధమైయ్యారు శ్రీశైలం దేవస్థానం అధికారులు. చెంచు గిరిజనులకు గతంలోనే 30 దుకాణాలు కేటాయించారు. కోర్టు ఆదేశాలతో మరో 42 షాపులను అలాట్ చేశారు. ఇక, మిగిలిన 109 దుకాణాలకు రేపు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. శ్రీశైలంలో గతంలో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..