AP Budget: సంక్షేమం, అభివృద్ధియే లక్ష్యం.. అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2026-27 గానూ వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. శనివారం (ఫిబ్రవరి 14) ఉదయం 11:15కి ఏపీ శాసనసభ ముందు ఉంచారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు మంత్రు పయ్యావుల తెలిపారు. తమ దృష్టిలో బడ్జెట్‌ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని.. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగుల పెట్టించాలనే సంకల్పంతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

AP Budget: సంక్షేమం, అభివృద్ధియే లక్ష్యం.. అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్..
Ap Finance Minister Payyavula Keshav

Updated on: Feb 14, 2026 | 12:14 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2026-27 గానూ వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. శనివారం (ఫిబ్రవరి 14) ఉదయం 11:15కి ఏపీ శాసనసభ ముందు ఉంచారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు మంత్రు పయ్యావుల తెలిపారు. తమ దృష్టిలో బడ్జెట్‌ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని.. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగుల పెట్టించాలనే సంకల్పంతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతకుముందు ఉదయం 10.30కి బడ్జెట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. బడ్జెట్ అనంతరం శాసనసభలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. అలాగే శాసనమండలిలో వార్షిక బడ్జెట్‌ను హోంమంత్రి అనిత ప్రవేశపెట్టనుండగా.. వ్యవసాయ బడ్జెట్‌ను రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు.

బడ్జెట్ అంటే మా దృష్టిలో కేవలం పద్దుల లెక్కలు కాదని, భవిష్యత్‌పై కొండంత ఆశలు చూపే బడ్జెట్ అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. 2014లో జరిగిన ఆహేతుక విభజన, గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ఇబ్బందుల్లో కూరుకుపోయిందని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వ నిర్మాణాత్మక విధానాల వల్ల రాష్ట్రం అభివృద్ధి పథంలో నిలిచిందని పయ్యావుల కేశవ్ తెలిపారు.

బ్రాండ్ చంద్రబాబు వల్లే స్వర్ణాంధ్ర సాకారమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. గూగుల్‌తో చంద్రబాబు ప్రభుత్వం చేసుకుంది బాహుబలి ఒప్పందమని అన్నారు. రైతుల కలలను నెరవేర్చేలా, యువతకు ఉద్యోగవకాశాలు కల్పించేలా, తన బిడ్డలను చక్కగా పెంచాలనే తల్లికి భరోసా ఇచ్చేలా బడ్జెట్ రూపొందించామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దేలా 2024లో బడ్జెట్ ప్రవేశపెడితే… స్వర్ణాంధ్ర విజన్-2047కు బాటలు వేస్తూ 2025లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పారు. ఆర్థిక విధ్వంసం ఎదుర్కొన్న రాష్ట్రాన్ని సరిదిద్దడానికి రెండేళ్ల సమయం ఎంత మాత్రమూ సరిపోదని మంత్రి చెప్పారు.

ఏపీ వార్షిక బడ్జెట్ మొత్తంః  3,32,205 కోట్లు

రెవెన్యూ వ్యయంః రూ. 2,56,143 కోట్లు

మూలధన వ్యయంః రూ. 53,915 కోట్లు

రెవెన్యూ లోటుః రూ. 22,002.50 కోట్లు

ఆర్థిక ద్రవ్య లోటుః రూ. 75,868.09 కోట్లు

ప్రాథమిక లోటుః రూ. 38,587.54 కోట్లు

కేంద్ర పన్నుల వాటా రూ.64,362 కోట్లు

పన్ను ఆదాయం రూ.1,25,845 కోట్లు

పన్నుయేతర ఆదాయం రూ.11,473కోట్లు

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..