Telugu News Andhra Pradesh News Andhra Pradesh 16th SIPB approves 31 projects worth Rs 39,436 crore investments, 1.11 lakh jobs expected to be generated
Andhra Pradesh Jobs: ఏపీ నిరుద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్.. 1,11,278 కొత్త ఉద్యోగాలు వచ్చేస్తున్నాయ్
సచివాలయంలో మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన 16వ ఎస్ఐపీబీ సమావేశం రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలియచేసింది. పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో రూ. 39,436.84 కోట్ల విలువైన ప్రతిపాదనలకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు..
అమరావతి, ఏప్రిల్ 7: రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో సౌరవిద్యుత్ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి పునరుద్ఫాదక విద్యుత్ ను తయారు చేసుకునేందుకు వీలుందని ఆయన సూచించారు. దీనికి అనుగుణంగా ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ఉత్పాదనకు అనుగుణంగా భవిష్యత్తులో ఆ విద్యుత్ ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేలా ట్రాన్స్ మిషన్ లైన్లను కూడా సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. సచివాలయంలో మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన 16వ ఎస్ఐపీబీ సమావేశం రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలియచేసింది. పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో రూ. 39,436.84 కోట్ల విలువైన ప్రతిపాదనలకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు ఆమోదం తెలియచేసింది. 31 ప్రాజెక్టుల ద్వారా 1,11,278 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.
ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్ధ్యానికి అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 325 గిగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో వివిధ పెట్టుబడి ప్రతిపాదనతో వస్తున్న పరిశ్రమల్లో ఆధునిక భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేసుకోవటంపై కూడా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు.
విద్యుత్ రంగం: మొత్తం 8 పెట్టుబడులు రూ.12,552 కోట్ల పెట్టుబడులు, 69,070 ఉద్యోగాలు
క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ హైబ్రిడ్ సిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ – కడప, అనంతపురం జిల్లాలు – రూ.1,391 కోట్ల పెట్టుబడి – 190 ఉద్యోగాలు
క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ హైబ్రిడ్ సిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ – కడప జిల్లా – రూ.1,391 కోట్ల పెట్టుబడి – 190 ఉద్యోగాలు
ఎస్సార్ రెన్యువబుల్స్ సోలార్ టు లిమిటెడ్ – కర్నూలు జిల్లా – రూ.1,327 కోట్ల పెట్టుబడి – 1,035 ఉద్యోగాలు
ఎస్సార్ రెన్యువబుల్స్ హైబ్రిడ్ వన్ లిమిటెడ్ – కర్నూలు జిల్లా – రూ.2,714 కోట్ల పెట్టుబడి – 1,240 ఉద్యోగాలు
ఎస్సార్ రెన్యువబుల్స్ హైబ్రిడ్ వన్ లిమిటెడ్ – అనంతపురం జిల్లా – రూ.1,714 కోట్ల పెట్టుబడి – 220 ఉద్యోగాలు
పేస్ డిజిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ – కడప జిల్లా – రూ.745 కోట్ల పెట్టుబడి – 345 ఉద్యోగాలు
ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ – పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఏలూరు, విజయనగరం జిల్లాలు – రూ.3,200 కోట్ల పెట్టుబడి – 65,000 ఉద్యోగాలు
హెచ్‌హెచ్‌పీ ఎయిట్ ప్రైవేట్ లిమిటెడ్ – తిరుపతి జిల్లా – రూ.70 కోట్ల పెట్టుబడి – 850 ఉద్యోగాలు
ఐటీ, ఈ అండ్ సీలో మొత్తం 11 పెట్టుబడులు రూ.18,210.36 కోట్లు, 36,411 ఉద్యోగాలు
ఇన్ఫోసిస్ లిమిటెడ్ – యండాడ, విశాఖపట్నం – రూ.750 కోట్ల పెట్టుబడి – 7,000 ఉద్యోగాలు
క్రెడెన్స్ రియాలిటీ – తాళ్లవలస, విశాఖపట్నం – రూ.386.88 కోట్ల పెట్టుబడి – 6,500 ఉద్యోగాలు
ఫ్యూజీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ – కాపులుప్పాడ, విశాఖపట్నం – రూ.425 కోట్ల పెట్టుబడి – 2,500 ఉద్యోగాలు
శ్రీటెక్ డేటా లిమిటెడ్ – కాపులుప్పాడ, విశాఖపట్నం – రూ.1,800 కోట్ల పెట్టుబడి
పీజీ టెక్నోప్లాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ – శ్రీసిటీ, తిరుపతి జిల్లా – రూ.1,305 కోట్ల పెట్టుబడి, 2,910 ఉద్యోగాలు
ఎన్‌పీఎస్‌పీఎల్ స్పెషాలిటీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ – కుప్పం, చిత్తూరు జిల్లా – రూ.2,550 కోట్ల పెట్టుబడి – 400 ఉద్యోగాలు
ఐస్ప్రౌట్ బిజినెస్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ – విశాఖపట్నం – రూ.626.90 కోట్లు పెట్టుబడి – 12,500 ఉద్యోగాలు
ఆర్ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ – శ్రీ సత్య సాయి జిల్లా – రూ.10,239.78 కోట్ల పెట్టుబడులు – 3,017 ఉద్యోగాలు
సీ డాక్ – అమరావతి క్వాంటం వ్యాలీ – రూ.17 కోట్ల పెట్టుబడి – 12 ఉద్యోగాలు
పీక్యూ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్ – అమరావతి క్వాంటం వ్యాలీ – రూ.1.8 కోట్ల పెట్టుబడి – 20 ఉద్యోగాలు
క్వాంటం ఏఐ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ – అమరావతి క్వాంటం వ్యాలీ – రూ.108 కోట్ల పెట్టుబడి – 1,552 ఉద్యోగాలు
పర్యాటక రంగంలో మొత్తం 2 పెట్టుబడులు రూ.200.15 కోట్లు, 270 ఉద్యోగాలు
సన్ రే గ్రీన్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ – విజయనగరం – రూ.117.66 కోట్ల పెట్టుబడి – 150 ఉద్యోగాలు
రవిప్రియ హాస్పిటాలిటీస్ ఎల్ఎల్‌పీ – ఒంగోలు – రూ.82.49 కోట్ల పెట్టుబడి – 120 ఉద్యోగాలు
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మొత్తం 2 పెట్టుబడులు రూ.1,222.73 కోట్లు, 550 ఉద్యోగాలు
ఇండస్ కాఫీ ప్రైవేట్ లిమిటెడ్ – తిరుపతి – రూ.233.73 కోట్ల పెట్టుబడి – 100 ఉద్యోగాలు
రెడ్ బెర్రీ ఫుడ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ – చిత్తూరు – రూ.989 కోట్ల పెట్టుబడి – 450 ఉద్యోగాలు
ఇండస్ట్రీస్, కామర్స్ రంగాల్లో మొత్తం 8 పెట్టుబడులు రూ.7,251.6 కోట్లు, 4,977 ఉద్యోగాలు
మెట్రో డెకరేటివ్ లిమిటెడ్ – నాయుడుపేట – రూ.1,032 కోట్ల పెట్టుబడి – 400 ఉద్యోగాలు
ఆర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ పెల్లెట్ ప్లాంట్ 3 – విశాఖపట్నం – రూ.1,400 కోట్ల పెట్టుబడి – 250 ఉద్యోగాలు
శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ – ఎస్పీఎస్సార్ నెల్లూరు – రూ.3,678 కోట్ల పెట్టుబడి – 3,200 ఉద్యోగాలు
బాల్ బెవరేజెస్ ప్యాకేజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ – శ్రీసిటీ – రూ.633 కోట్ల పెట్టుబడి – 117 ఉద్యోగాలు
సాన్సో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ – ఏలూరు – రూ.80 కోట్ల పెట్టుబడి – 210 ఉద్యోగాలు
ఆర్ఎస్‌బీ ట్రాన్సిమిషన్ లిమిటెడ్ – శ్రీసిటీ – రూ.143.99 కోట్ల పెట్టుబడి – 350 ఉద్యోగాలు
వెంకటేశ్వర పేపర్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ – కృష్ణా – రూ.63.61 కోట్ల పెట్టుబడి – 100 ఉద్యోగాలు
అనాడ్రోన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ – ఎస్పీఎస్సార్ నెల్లూరు – రూ.221 కోట్ల పెట్టుబడి – 350 ఉద్యోగాలు