Anandayya Medicine: సోమిరెడ్డి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఆనందయ్య… మీరూ మీరూ చూసుకోండంటూ ఫైర్..

|

Jun 05, 2021 | 9:59 PM

Anandayya Medicine: కరోనా నివారణకు ఆనందయ్య తయారు చేసిన మందును ఆన్‌లైన్‌లో అందిస్తామంటూ వైసీపీ నేతలు వెబ్‌సైట్‌ సృష్టించారంటూ...

Anandayya Medicine: సోమిరెడ్డి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఆనందయ్య... మీరూ మీరూ చూసుకోండంటూ ఫైర్..
Anandayya
Follow us on

Anandayya Medicine: కరోనా నివారణకు ఆనందయ్య తయారు చేసిన మందును ఆన్‌లైన్‌లో అందిస్తామంటూ వైసీపీ నేతలు వెబ్‌సైట్‌ సృష్టించారంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆనందయ్య ఖండించారు. సోమిరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆనందయ్య.. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తోసిపుచ్చారు. వెబ్‌సైట్‌కు, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. సోమిరెడ్డి దీన్ని చాలా ఎక్కువ చేసి చూపిస్తున్నారని అన్నారు. ఆయన అంత రియాక్ట్ అవ్వాల్సిన, మాట్లాడాల్సిన అవసరం లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. తనను రాజకీయాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు ఆనందయ్య. ‘‘మీకూ మీకూ ఏమైనా ఉంటే నేరుగా చూసుకోండి కానీ, నన్ను మాత్రం మీ రాజకీయాల్లోకి లాగకండి.’’ అని ఆనందయ్య వ్యాఖ్యానించారు. సోమవారం నుంచి మందు పంపిణీ జరగదని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం నుంచి అన్ని జిల్లాలకు మందు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆనందయ్య క్లారిటీ ఇచ్చారు.

కాగా, ప్రజలకు ఉచితంగా ఇవ్వాలనుకున్న ఆనందయ్య మందుతో అధికారపార్టీ నేతలు బిజినెస్‌ చేసుకోవాలని చూశారంటూ అంతకు ముందు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. ఆనందయ్య మందును ఆన్‌లైన్‌లో అందిస్తామంటూ వెబ్‌సైట్‌ సృష్టించింది కూడా వైసీపీ నేతలే అని అన్నారు. ఇదిలాఉంటే.. సోమిరెడ్డి ఆరోపణలపై సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్దన్‌రెడ్డి. ఆగ్రహంతో వ్యక్తిగత దూషణలకు దిగారు. సోమిరెడ్డి దిగజారి మాట్లాడుతున్నారన్న కాకాని.. తేల్చుకుందాం దమ్ముంటే రా అంటూ సవాల్‌ విసిరారు. ఆరోపణలకు ఆధారాలు చూపించాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు న్యాయమూర్తి విచారణకు కూడా తాను సిద్ధమన్నారు కాకాని. తన తప్పుందని నిరూపిస్తే ఉరేసుకునేందుకు కూడా వెనుకాడబోనని సవాల్ విసిరారు. ఆనందయ్య మందుపై మొదటి నుంచీ సర్వేపల్లి నేతల మధ్య మాటల యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదం మదురి పాకానపడటంతో.. చివరికి ఇరు పక్షాలకు ఆనందయ్య స్ట్రాంగ్‌ కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది.

Also read:

ఢిల్లీలో రేషన్ హోమ్ డెలివరీని నిలిపివేసిన కేంద్రం….. ఇది రాజకీయ కక్షేనంటున్న ఆప్ నేతలు