ఆ ఘోరాలన్నీ మీరు చేయించినవి కాదా బాబు గారు: ముద్రగడ ఫైర్

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. అందులో బాబును ఘాటుగా విమర్శించారు ముద్రగడ. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో పోలీసుల తీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ‘‘మీ పాలనలో పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి.. మాలాంటి ఎన్నో జాతులను లాఠీలతో కొట్టించింది నిజం కాదా..? అని ఆయన ప్రశ్నించారు. ఏదైనా సమస్యపై రోడ్డు మీదకు వస్తే జైలుకే అని బెదిరించడం.. రోడ్లపైకి వచ్చిన విద్యార్థులను హెచ్చరించి మీరు […]

ఆ ఘోరాలన్నీ మీరు చేయించినవి కాదా బాబు గారు: ముద్రగడ ఫైర్
Follow us

| Edited By:

Updated on: Jan 13, 2020 | 4:41 PM

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. అందులో బాబును ఘాటుగా విమర్శించారు ముద్రగడ. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో పోలీసుల తీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ‘‘మీ పాలనలో పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి.. మాలాంటి ఎన్నో జాతులను లాఠీలతో కొట్టించింది నిజం కాదా..? అని ఆయన ప్రశ్నించారు. ఏదైనా సమస్యపై రోడ్డు మీదకు వస్తే జైలుకే అని బెదిరించడం.. రోడ్లపైకి వచ్చిన విద్యార్థులను హెచ్చరించి మీరు కాదా..? అని ముద్రగడ అడిగారు.

మా కుటుంబాన్ని మీరు, మీ యువరాజా కసితీరా అవమానించి లాఠీలతో కొట్టుకుంటూ తీసుకెళ్లి ఆసుపత్రిలో బంధించారు. బట్టలు మార్చుకోవడానికి వీలు లేకుండా పోలీసులను పెట్టి నిద్రలేని రాత్రులు మిగిల్చారు. ఇంతటి ఘోరమైన అవమానం చేయమని ఏ చట్టం చెబుతోందని ఆయన ప్రశ్నించారు. ఆనాడు పోలీసులతో అరాచకం చేయించి.. ఈ రోజు పోలీసు రాజ్యం అని బొంకుతున్నారు అంటూ ముద్రగడ ఘాటుగా విమర్శించారు.