AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆనాడు వైఎస్‌ తీర్చలేకపోయినా.. ఇప్పుడు జగన్ తీర్చాడు

ఆనాడు తాను వైఎస్‌ని అడిగిన కోరికను ఆయన తీర్చలేకపోయినా.. ఇప్పుడు జగన్ తీర్చాడని అన్నారు సీనియర్ నటుడు విజయ్ చందర్. ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా గురువారం నాడు విజయ్ చందర్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయనను కలిసిన ప్రతిసారి ఆప్యాయతగా పిలిచేవారని, యోగక్షేమాలు అడిగి తెలుసుకునే వారని అన్నారు. ఇక ఎఫ్‌డీసీ ఛైర్మన్ కావాలని ఇరవై ఏళ్ల క్రితమే తాను వైఎస్‌ని అడిగానని.. అయితే అనివార్య […]

ఆనాడు వైఎస్‌ తీర్చలేకపోయినా.. ఇప్పుడు జగన్ తీర్చాడు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 15, 2019 | 9:08 AM

Share

ఆనాడు తాను వైఎస్‌ని అడిగిన కోరికను ఆయన తీర్చలేకపోయినా.. ఇప్పుడు జగన్ తీర్చాడని అన్నారు సీనియర్ నటుడు విజయ్ చందర్. ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా గురువారం నాడు విజయ్ చందర్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయనను కలిసిన ప్రతిసారి ఆప్యాయతగా పిలిచేవారని, యోగక్షేమాలు అడిగి తెలుసుకునే వారని అన్నారు. ఇక ఎఫ్‌డీసీ ఛైర్మన్ కావాలని ఇరవై ఏళ్ల క్రితమే తాను వైఎస్‌ని అడిగానని.. అయితే అనివార్య కారణాల వలన ఆయన ఇవ్వలేకపోయారని అన్నారు. ఇప్పుడు జగన్ ద్వారా నా కల నెరవేరిందని.. వైఎస్సార్ ఆత్మే జగన్ అని ప్రశంసలు కురిపించారు.

అనంతరం తెలుగు చిత్రసీమను ఉద్దేశించి మాట్లాడిన విజయ్ చందర్.. హైదరాబాద్‌లో ఉన్న సినీ ప్రముఖులు, ఆంధ్ర రాష్ట్ర ప్రముఖులు మాతృభూమి అభివృద్ధికి తోడ్పాటు అందించారని అన్నారు. ఇకనుంచి ప్రతిభ, టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు ఇస్తానని.. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా సినీ పరిశ్రమ పని చేస్తుందని తెలిపారు. ఇక నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్‌లో స్థిరపడిన ప్రముఖులు తోడ్పాటును అందించాలని కోరారు. ఏపీ ఫిల్మ్ స్టూడియోకు ముఖ్యమంత్రి జగన్ ఆలోచన చేస్తారని.. 4 సంవత్సరాలలో విజయం సాధించి తీరుతామని విజయ్ చందర్ చెప్పుకొచ్చారు. సీఎం తనపై పెట్టిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని ధీమా వ్యక్తం చేశారు

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?