AP Rains: చిత్రావతి వరదలో చిక్కుకున్న బాధితులు సేఫ్.. హెలికాప్టర్‌ ద్వారా రక్షించిన రెస్క్యూ టీమ్‌..

|

Nov 19, 2021 | 7:54 PM

నీటి కోసం కటకటలాడే అనంతపురం జిల్లాను కూడా వరదలు ముంచెత్తాయి. వరుణుడి మహోగ్రరూపానికి చిత్రావతి నది ఒక్కసారిగా ఉప్పొంగింది. చిత్రావతి వరద ప్రవాహంలో చిక్కుకున్న..

AP Rains: చిత్రావతి వరదలో చిక్కుకున్న బాధితులు సేఫ్.. హెలికాప్టర్‌ ద్వారా రక్షించిన రెస్క్యూ టీమ్‌..
Anantapur District Air Forc
Follow us on

నీటి కోసం కటకటలాడే అనంతపురం జిల్లాను కూడా వరదలు ముంచెత్తాయి. వరుణుడి మహోగ్రరూపానికి చిత్రావతి నది ఒక్కసారిగా ఉప్పొంగింది. చిత్రావతి వరద ప్రవాహంలో చిక్కుకున్న పది మందిని కాపాడేందుకు గంటలతరబడి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది. కారుతో కాజ్‌వే దాటేందుకు ప్రయత్నించిన నలుగురు చిత్రావతి నదిలో చిక్కుకుని సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. వాళ్లను కాపాడేందుకు జేసీబీతో వెళ్లిన మరో ఆరుగురు సైతం వరద ఉధృతిలో ఇరుక్కుపోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు టెన్షన్ కంటిన్యూ అయ్యింది. బాధితుల్ని కాపాడేందుకు జిల్లా యంత్రాంగం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో చివరికి ఎయిర్‌ ఫోర్స్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఉదయం నుంచి వరద ప్రవాహంలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతోన్న బాధితులను ఎయిర్‌ ఫోర్స్ కాపాడింది. హెలికాప్టర్‌ ద్వారా ఒక్కొక్కరిని సేఫ్‌గా బయటికి తీసుకొచ్చారు.

చిత్రావతి నది ఉధృతికి గ్రామాలకు గ్రామాలే నీట మునిగాయ్. చిత్రావతి ఉగ్రరూపానికి కదిరి, పుట్టపర్తి పట్టణాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయ్. పుట్టపర్తిలో హనుమాన్, సత్యమ్మ దేవాలయాలు నీటిలో మునిగిపోయాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఇవి కూడా చదవండి: Skin Care Tips: చలికాలంలో డ్రై స్కిన్‌తో బాధపడుతున్నారా.. అద్భుమైన చిట్కా మీకోసం.. ఇంట్లోనే చేసుకోండిలా..

MLA Roja: నాకు చాలా సంతోషంగా ఉంది.. బైబై బాబూ అంటూ రోజా సంచలన వీడియో