అఘోరాలైనా..అఘోరీలైనా..ఏళ్ల తరబడి హిమాలయాల్లో తపమాచరిస్తుంటారు. కుంభమేళా సమయంలోనే జనం మధ్యకు వస్తారు. కానీ ఉన్నట్టుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షమైన ఓ అఘోరీ..ఎప్పుడూ లేని న్సూసెన్స్ క్రియెట్ చేస్తోంది. నడిరోడ్డుపై ఈ అఘోరీ చేష్టలు..ఇటు జనాన్ని అటు పోలీసులను చికాకు పెట్టిస్తున్నాయి. ఈమె పేరు తెలీదు..ఊరు తెలీదు..ఏం చేస్తుందో అంతకంటే. అందరికీ తెలిసిందల్లా అఘోరీనంటే ఆమె చేస్తున్న న్యూసెన్సే. కొద్దిరోజుల క్రితం ఆల్ ఆఫ్ సడెన్‌గా మహబూబ్‌నగర్‌లో ప్రత్యక్షమైన అఘోరీ.. అక్కడి జనానికి చికాకు తెప్పింది. దీంతో ఆమెను తెలంగాణ బోర్డర్ దాటించేశారు పోలీసులు. మహారాష్ట్ర వెళ్లినట్టే వెళ్లి..ఏపీలో ప్రత్యక్షమైన అఘోరీ అక్కడా సేమ్‌సీన్‌తో రచ్చ రేపింది. అనకాపల్లి నక్కపల్లి టోల్‌ప్లాజా దగ్గర నానా హంగామా చేసింది. టోల్‌గేట్ పేమెంట్ విషయంలో సిబ్బందికి శాపనార్ధాలతో చెమటలు పట్టించింది.
పోలీసులు ఊపిరి తీసుకునే లోపే..మళ్లీ సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఆత్మార్పణం చేసుకుంటానంటూ హల్‌చల్ చేసింది. దీంతో ఆమెను బంధించి ఆ ఘోరం నుంచి బయటపడ్డారు పోలీసులు. ఆ తర్వాత మహారాష్ట్ర సరిహద్దుల్లోకి తీసుకెళ్లి అఘోరిని వదిలేశారు. ఆ గండం గడించిందనుకుంటుండగానే..శ్రీకాళహస్తి ఆలయం దగ్గర హల్‌చల్ చేసింది అఘోరీ. ఆలయంలోకి అనుమతించకపోవడంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కొద్దిరోజుల క్రితం ఎవరో ఈ అఘోరీకి ఎర్రటి వస్త్రాన్ని కట్టారు. రెండు మూడ్రోజులైనా ఆ వస్త్రాన్ని శరీరంపై ఉంచుకోలేదామె.ఏమైనా అంటే..తాను అఘోరీని అంటుంది. ఇక మంగళగిరిలో అఘోరీ చేసిన న్యూసెన్స్.. పీక్స్‌కి వెళ్లింది. విజయవాడకు వెళ్లే బైపాస్ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ను కలవాల్సిందేనని పట్టుబట్టడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఆమెను తరలించే ప్రయత్నం చేయగా ఆగ్రహంతో రగిలిపోయింది. దాడి చేసినంత పని చేసింది. చేసేదేమీ లేక చివరకు అఘోరీని తాళ్లతో బంధించి అదుపులోకి తీసుకున్నారు..పోలీసులు. అఘోరాలంటే శివ భక్తి, సాధన శక్తి తప్ప మరే ఏ చింతన ఉండదు. ఒకవేళ జనంలోకి వస్తే శ్మశానాలనే ఆవాసాలుగా మల్చుకుంటారు. ఈ అఘోరి మాత్రం ఇళ్ల మధ్యలో ఉంటుంది. నిత్యం జనంలో ఉంటూ హల్‌చల్ చేస్తోంది. ఎక్కడికెళ్తే అక్కడ నానా రచ్చ చేస్తోంది. అక్కడ ఉండే వాళ్లతో గొడవకు దిగుతోంది. నిజానికి గతంలో అఘోరీలెవరూ ఇలా చేసిన సందర్భాలు లేవు. మరి ఈ ఆఘోరీ మాత్రమే ఎందుకిలా చేస్తుందన్నది అర్థంకాని ప్రశ్న. ఈమెను చూస్తే..అఘోరీలు ఇలా ఉంటారా అనే అనుమానం కూడా వస్తుంది. ఇంతకూ ఈ అఘోరీ సమస్య ఏంటి..? ప్రజలను ఎందుకు చికాకు పెడుతోంది..? ఆ విషయం తెలియకే పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మరి తెలుగు రాష్ట్రాలకు ఈ అఘోరీ ఉపద్రవం ఎప్పుడు వీడుతుందో చూడాలి.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.