YSRCP: మేమంతా సిద్దం బస్సుయాత్ర జోష్ కొనసాగింపు.. రానున్న రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..

|

Apr 24, 2024 | 9:27 PM

సిద్ధం సభలతో ఏపీలో క్యాడర్‌కు ఒక హై ఇచ్చిన సీఎం జగన్‌.. మేమంతా సిద్ధం యాత్రతో.. పీక్‌లోకి తీసుకెళ్లారు. 22 రోజులపాటు సాగిన బస్సుయాత్రతో ప్రజలతో మమేకం అవుతూ ముందుకెళ్లారు. ప్రజలను కలుస్తూ.. వారి సమస్యలు వింటూ.. పరిష్కారాలు చూపిస్తూ.. కష్టాల్లో ఉన్నవారికి భరోసా ఇస్తూ ముందుకు సాగారు జగన్‌. జెండాలు జతకట్టడమే ప్రత్యర్థుల ఎజెండా అంటూ ప్రసంగాలతో జోష్‌ నింపిన సీఎం జగన్‌ అసలు ఎజెండా ఏంటి? ఆయన ఈ యాత్రతో అటు కేడర్‌కు ఇటు ప్రజలకు ఏం సందేశం ఇచ్చారు?

YSRCP: మేమంతా సిద్దం బస్సుయాత్ర జోష్ కొనసాగింపు.. రానున్న రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
Cm Jagan
Follow us on

సిద్ధం సభలతో ఏపీలో క్యాడర్‌కు ఒక హై ఇచ్చిన సీఎం జగన్‌.. మేమంతా సిద్ధం యాత్రతో.. పీక్‌లోకి తీసుకెళ్లారు. 22 రోజులపాటు సాగిన బస్సుయాత్రతో ప్రజలతో మమేకం అవుతూ ముందుకెళ్లారు. ప్రజలను కలుస్తూ.. వారి సమస్యలు వింటూ.. పరిష్కారాలు చూపిస్తూ.. కష్టాల్లో ఉన్నవారికి భరోసా ఇస్తూ ముందుకు సాగారు జగన్‌. జెండాలు జతకట్టడమే ప్రత్యర్థుల ఎజెండా అంటూ ప్రసంగాలతో జోష్‌ నింపిన సీఎం జగన్‌ అసలు ఎజెండా ఏంటి? ఆయన ఈ యాత్రతో అటు కేడర్‌కు ఇటు ప్రజలకు ఏం సందేశం ఇచ్చారు? 22 రోజులు, 2200 కిలోమీటర్లు, 86 అసెంబ్లీ, 21 పార్లమెంటు నియోజకవర్గాలు, కోట్లాదిమంది అభిమానులు, ఒకే ఒక్క నాయకుడు వైఎస్సార్‌సీపీ అధినేత.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సుదీర్ఘ బస్సుయాత్ర ముగిసింది. గత నెల 27న ప్రారంభమైన జగన్‌ యాత్ర.. సక్సెస్‌ఫుల్‌గా సాగింది. ఆయన ఏ ఊర్లోకి ప్రవేశించినా.. ఏ నియోజవర్గంలోకి అడుగుపెట్టినా జననీరాజనమే.

ఈ పార్లమెంట్ నియోజకవర్గాల్లో సాగిన యాత్ర..

  • వైఎస్‌ఆర్‌ కడప జిల్లా
  • నంద్యాల జిల్లా
  • కర్నూలు జిల్లా
  • అనంతపురం జిల్లా
  • శ్రీసత్యసాయి జిల్లా
  • అన్నమయ్య జిల్లా
  • చిత్తూరు జిల్లా
  • తిరుపతి జిల్లా
  • నెల్లూరు జిల్లా
  • ప్రకాశం జిల్లా
  • పల్నాడు జిల్లా
  • గుంటూరు జిల్లా
  • ఎన్టీఆర్‌ జిల్లా
  • కృష్ణా జిల్లా
  • ఏలూరు జిల్లా
  • పశ్చిమగోదావరి జిల్లా
  • తూర్పుగోదావరి జిల్లా
  • అంబేద్కర్‌ కొనసీమ జిల్లా
  • కాకినాడ జిల్లా
  • అనకాపల్లి జిల్లా
  • విశాఖ జిల్లా
  • విజయనగరం జిల్లా
  • శ్రీకాకుళం జిల్లా

భవిష్యత్ కార్యాచరణ ఇలా..

యాత్ర మధ్యలోనే ప్రజలను కలుస్తూ సాగారు సీఎం. వారి కష్టనష్టాలను తెలుసుకుంటూ పరిష్కారాలు చూపిస్తూ.. భరోసాఇస్తూ.. స్పూర్తిని నింపుతూ ముందుకెళ్లారు వైఎస్‌ జగన్‌. యాత్ర అంటే మూడు మాటలు.. ఆరు గ్యారెంటీ హామీలుగా కాకుండా.. ప్రజలకు పాలకుడు దగ్గరివాడు.. అందరివాడంటూ చాటిచెప్పారు. మా నమ్మకం నువ్వే జగన్‌ అని ప్రజలను నినదించేలా చేశారు. జగన్‌ బస్సుయాత్రతో తన అజెండాను వివరించారు సీఎం జగన్‌. ఇక గురువారం ఉదయం కడప జిల్లా పులివెందులలో తన నామినేషన్‌ దాఖలు చేసిన తరువాత ప్రచార హోరు మరింత జోరందుకోనుంది. శుక్రవారం మేనిఫెస్టో ప్రకటించిన తరువాత వచ్చే 17 రోజుల్లో 50 నుంచి 70 సభల వరకు నిర్వహించేందుకు రంగం సిద్ధం అవుతోంది. సిద్ధం.. మేమంతా సిద్ధాన్ని మించి.. ఈ సభలు ఉండబోతున్నాయని టాక్‌. ఇప్పటికే వైసీపీ సేనలు ఉత్తేజం మీద ఉన్నాయి. జగన్‌ ప్రసంగాలకు తోడు.. సోషల్‌మీడియాలో హైప్‌ భారీగా ఉండడంతో.. జన ప్రభంజనం అత్యంత భారీ స్థాయిలో కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..