AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna District: ‘వెలుగు’ వాట్సాప్ గ్రూపులో పోర్న్ వీడియో కలకలం.. అసలు ఏం జరిగిందంటే..?

ప్రజంట్ ప్రపంచమంతా సోషల్ మీడియా ద్వారానే నడుస్తోంది. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతి సమాచారం ఈజీగా చేరవేసే ఆస్కారం...

Krishna District: 'వెలుగు' వాట్సాప్ గ్రూపులో పోర్న్ వీడియో కలకలం.. అసలు ఏం జరిగిందంటే..?
Adult Video
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 13, 2021 | 3:11 PM

ప్రజంట్ ప్రపంచమంతా సోషల్ మీడియా ద్వారానే నడుస్తోంది. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతి సమాచారం ఇతరులకు ఈజీగా చేరవేసే ఆస్కారం దొరికింది. టెలిగ్రామ్, వాట్సాఫ్ వంటి స్మార్ట్ ఫోన్ యాప్స్ వేగంగా సమాచారాన్ని చేరవేసేందుకు ఉపయోగపడుతున్నాయి. అందుకే పల్లె జనాలు సైతం.. ఈ యాప్స్ ఎలా వినియోగించాలో శ్రద్ద పెట్టి నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో పెద్ద కంపెనీల ఉద్యోగులు మాత్రమే కాదు.. మహిళలతో ఏర్పడిన స్వయం సహాయక సంఘాలు కూడా వాట్సాప్ ద్వారానే ఇన్ఫర్మేషన్ ఇచ్చిపుచ్చుకుంటున్నారు.  అలా డ్వాక్రా గ్రూపులకు సమాచారాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన వెలుగు వాట్సాప్ గ్రూపులో ఓ అధికారి బ్లూ ఫిల్మ్ పోస్ట్ చేశారు.  ఈ సంఘటన కృష్ణా జిల్లా చాట్రాయి మండలంలో చోటుచేసుకుంది.

వెలుగు గ్రూప్ కి చెందిన మహిళలంతా కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఆ గ్రూప్ లో మొత్తం మహిళలే ఉన్నారు. గ్రూప్ అడ్మిన్‌గా స్థానిక అధికారి ఉన్నారు.  కాగా.. ఆయన నంబర్ నుంచి గ్రూప్ లో అసభ్యకరమైన ఓ పోర్న్ వీడియో ప్రత్యక్షమైంది. దీంతో.. ఆ వీడియో చూసి అందరూ షాకయ్యారు. పొరపాటున అభ్యంతరకర వీడియో గ్రూపులో పంపినట్లు చెబుతూ.. సదరు వెలుగు అధికారి .. మిగిలిన గ్రూప్ లోని సభ్యులందరికీ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. తనకు ఎవరో పంపిన వీడియో పొరపాటున సంఘాల గ్రూపులోకి చేరిందని చెప్పారు ఏపీఎం బాల సుబ్రహ్మణ్యం. మహిళా సభ్యులకు తాను నేరుగా క్షమాపణ చెప్పినట్లు వెల్లడించారు. తాను కావాలని చేసిన తప్పు కాదని.. పొరపాటుగా జరిగిందన్నారు. ఐతే అప్పటిగే జరగాల్సిన నష్టం జరిగింది. కొందరు ఈ వీడియో  స్క్రీన్ షాట్లు ఇతరులకు షేర్ చేసి తన పరువు తీస్తున్నారని సదరు అధికారి చెప్పారు. మరి తెలియక చేసిన తప్పుకు ఉన్నతాధికారులు పొరపాటు అని అతడిని వదిలేస్తారా..? లేదా చర్యలు తీసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది.

Also Read: బాయ్‌ఫ్రెండ్ కోసం యువతుల ఫైట్.. నడి రోడ్డు కాస్తా బాక్సింగ్ రింగ్ అయిపోయింది

 బెదిరింపు చీటీతో దొంగ .. చేతిరాత అర్థం కాక పట్టించుకోని క్యాషియర్‌.. తర్వాత ఏమైందంటే