Kidney Cheating: కిడ్నీ మార్పిడి చేస్తామంటూ రూ. 10లక్షలు వసూలు.. తీరా చూస్తే జంప్..!

| Edited By: Balaraju Goud

Jul 05, 2024 | 3:47 PM

విశాఖలో అవయవ మార్పిడి పేరుతో భారీ మోసం బయటపడింది. అనారోగ్యానికి గురైన తన భార్య కోసం ఆశ్రయించిన వ్యక్తిని నిండా ముంచారు. అడ్వాన్స్‌గా రూ. 10 లక్షలు తీసుకుని మోసగించినట్టు పోలీసులకు పిర్యాదు చేశాడు బాధితుడు. దీంతో మహిళ డాక్టర్ సహా ఆమె సహాయకుడిపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన విశాఖపట్నంలో వెలుగు చూసింది.

Kidney Cheating: కిడ్నీ మార్పిడి చేస్తామంటూ రూ. 10లక్షలు వసూలు.. తీరా చూస్తే జంప్..!
Kidney Racket
Follow us on

విశాఖలో అవయవ మార్పిడి పేరుతో భారీ మోసం బయటపడింది. అనారోగ్యానికి గురైన తన భార్య కోసం ఆశ్రయించిన వ్యక్తిని నిండా ముంచారు. అడ్వాన్స్‌గా రూ. 10 లక్షలు తీసుకుని మోసగించినట్టు పోలీసులకు పిర్యాదు చేశాడు బాధితుడు. దీంతో మహిళ డాక్టర్ సహా ఆమె సహాయకుడిపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన విశాఖపట్నంలో వెలుగుచూసింది.

విశాఖలో కిడ్నీ మార్పిడి పేరుతో భారీ మోసం వెలుగు చూడటంతో ప్రత్యేకంగా దృష్టి సారించారు పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి. డీసీపీ నేతృత్వంలో ఎనిమిది మందితో సిట్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందంలో డీసీపీ వన్ లక్ష్మీనారాయణ, ద్వారకా ఏసీపీ, సీఐ లతోపాటు ఇద్దరు ఎస్సైలు, మరో ఐదుగురు కానిస్టేబుల్ లో ఉన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం పని ప్రారంభించింది.

పురుషోత్త పురం ప్రాంతానికి చెందిన గోపి భార్య శారద అనారోగ్యానికి గురైంది. మెడికల్ టెస్టులు చేయించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో డయాలసిస్ కూడా చేయిస్తున్నారు. కిడ్నీ మార్పిడి చేయాల్సి రావడంతో.. కుటుంబ సభ్యులు ఎవరు ముందుకు రాలేదు. తన బ్లడ్ గ్రూప్ కూడా మ్యాచ్ కాకపోవడంతో, సీతమ్మధారలోని ఎన్నారై ఆసుపత్రి డాక్టర్ వాణిని సంప్రదించాడు గోపి. కిడ్నీ మార్పిడి చేయాలని అందుకు అనిల్ అనే ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేటర్ తన సిబ్బందికి ఆ కేసును అప్పగించింది. కిడ్నీ ఆర్గాన్ డోనర్లు సిద్ధంగా ఉన్నారని, 27 లక్షల రూపాయల ఖర్చవుతుందని అందుకు అడ్వాన్స్‌గా పది లక్షల రూపాయలు చెల్లించాలని సూచించారు.

దీంతో ఈ ఏడాది మార్చి మొదటి వారంలో ఐదు లక్షల రూపాయలు అనిల్‌కు ట్రాన్స్‌ఫర్ చేసినట్టు బాధితుడు గోపి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఏప్రిల్ లో మరో ఐదు లక్షల రూపాయలను దశల వారీగా తన స్నేహితుల ఖాతాల నుంచి ట్రాన్స్‌ఫర్ చేసినట్టు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత అనిల్ తోపాటు ఆసుపత్రి సిబ్బంది స్పందించకపోయేసరికి, 10 లక్షల రూపాయలు తిరిగి చెల్లించాలని కోరాడు గోపి. దీంతో వాళ్లు తనకు 10 లక్షల రూపాయలు ఇవ్వకపోగా బెదిరింపులకు దిగినట్టు ఫిర్యాదులు పేర్కొన్నాడు బాధితుడు.

కిడ్నీ మార్పిడి పేరుతో మోసం వ్యవహారం వెలుగులోకి రావడంతో ఒకసారిగా విశాఖలో కలకలం రేగింది. పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా ఈ కేసుపై దృష్టి సారించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దింపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఇక ఘటనకు సంబంధించి మహిళ డాక్టర్ సహా ఆమె సహాయకుడిపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..