AP Corona Updates: ఆంధ్రప్రదేశ్ కరోనా బులెటిన్ విడుదల.. గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

|

Feb 09, 2021 | 8:01 PM

AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా..

AP Corona Updates: ఆంధ్రప్రదేశ్ కరోనా బులెటిన్ విడుదల.. గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
Maharashtra Corona
Follow us on

AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 26,844 మంది నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షించగా.. 70 మందికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, కరోనా కారణంగా ఎవరూ మృత్యువాతపడలేదు. ఇదే సమయంలో 115 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,33,94,460 శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేయగా.. 8,88,555 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 8,80,478 మంది కరోనాను జయించి సురక్షితంగా ఉన్నారు. అయితే, కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 7,160 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 917 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

ఇదిలాఉంటే.. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా నమైదన 70 పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 24 కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత తూర్పు గోదావరిలో 11, విశాఖపట్నంలో 10, కృష్ణా జిల్లా 9, గుంటూరు 8 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Also read:

AP Panchayat Elections Result 2021: కొనసాగుతోన్న ఏపీ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌.. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం..

Important Deadlines:అలర్ట్‌.. ఈ చివరి గడువు తేదీలను గుర్తించుకోండి.. లేకపోతే మీరు చిక్కుల్లో పడాల్సిందే