Andhra Pradesh: చిత్తూరుజిల్లాలో దారుణం… మృత్యువాత పడిన నెమళ్ళు.. దర్యాప్తు చేస్తున్న అధికారులు..

|

Feb 11, 2022 | 8:47 AM

Andhra Pradesh: చిత్తూరు(Chittoor) జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోమల మండలంలో నెమళ్ళు(Peacocks) మృత్యువాత పడ్డాయి. మిట్టపల్లె సమీపంలోని పూలకొండ..

Andhra Pradesh: చిత్తూరుజిల్లాలో దారుణం... మృత్యువాత పడిన నెమళ్ళు.. దర్యాప్తు చేస్తున్న అధికారులు..
Peacock Dead
Follow us on

Andhra Pradesh: చిత్తూరు(Chittoor) జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోమల మండలంలో నెమళ్ళు(Peacocks) మృత్యువాత పడ్డాయి. మిట్టపల్లె సమీపంలోని పూలకొండ వ్యవసాయ పొలాల్లో మృతి చెందిన 7 నెమళ్లను స్థానికులు గుర్తించారు. వెంటనే స్పందించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు పశు వైద్యు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతపురం సీసీఎఫ్ శ్రీనివాస శాస్త్రి నెమళ్లు మృతి పై ఆరా తీశారు. అయితే గాలిలో వచ్చే వైరస్ తో నెమళ్లు మృతి చెందాయని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే మృతి చెందిన నెమళ్ళకు పశు వైద్య అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. నెమళ్ళ మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని అనంతపురం సీసీఎఫ్ శ్రీనివాసశాస్త్రి కోరారు. మృతిపై పూర్త నివేదిక ఇవ్వాలని చిత్తూరు డిఎఫ్ఓ ను అనంతపురం సీసీఎఫ్ ఆదేశించారు.

 

Also Read:

: తెలుగు మూవీ మొదలుపెట్టిన తమిళ్ హీరో.. శివకార్తికేయన్ సినిమా షూటింగ్ షురూ..

 

ఈరోజు రాత్రి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం.. రేపు రథోత్సవం.. అంతర్వేదికి ఆర్టీసీ ప్రత్యేకబస్సులు ఏర్పాటు

: మొఘల్ గార్డెన్స్ లో సందర్శకులకు అనుమతి.. తేదీలు, మార్గదర్శకాలు ఏమిటంటే..