అమెరికాలో కోటి దాటేసిన కరోనా కేసులు

| Edited By:

Nov 09, 2020 | 9:43 AM

అగ్రరాజ్యం అమెరికా కరోనా కేసుల్లోనూ మొదటి స్థానంలో కొనసాగుతోంది. రోజురోజుకు అక్కడ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి

అమెరికాలో కోటి దాటేసిన కరోనా కేసులు
Follow us on

US Covid 19 cases: అగ్రరాజ్యం అమెరికా కరోనా కేసుల్లోనూ మొదటి స్థానంలో కొనసాగుతోంది. రోజురోజుకు అక్కడ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నాటికి మొత్తం కేసుల సంఖ్య కోటిని దాటేసింది. ( కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 857 కొత్త కేసులు.. 4 మరణాలు)

అక్కడి గణాంకాల ప్రకారం శనివారం అమెరికాలో 1,26,156 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,51,300కు చేరింది. ఇక కొత్తగా 1,013 మంది కరోనాతో మరణించగా.. ఇప్పటివరకు మృత్యువాతపడిన వారి సంఖ్య 2,38,000కు చేరింది. అక్కడి అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభణ కొనసాగుతుండగా.. టెక్సాస్‌ అన్నింటికంటే ముందు వరుసలో ఉంది. ( ఏడాది క్రితం లవ్‌ మ్యారేజ్‌.. కుటుంబంతో చివరగా మహేష్ ఎప్పుడు మాట్లాడారంటే)

అయితే ఈ పెరుగుతున్న కేసులు అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కి సవాలుగా మారనున్నాయి. ట్రంప్ ఓడిపోయేందుకు గల కారణాలలో ఒకటి కరోనాను నియంత్రించకపోవడం. ఇక కరోనా మహమ్మారి కట్టడే తన తొలి ప్రాధాన్యత అని చెప్పి బైడెన్‌.. ఇప్పుడు ఏం చేయబోతున్నారన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ( డ్రగ్స్ కేసు.. నిర్మాత భార్య అరెస్ట్‌)