కాలిఫోర్నియాలో భూకంపం.. రిక్టార్ స్కేల్‌పై 6.4 గా నమోదు

అమెరికాలోని కాలిఫోర్నోయాలో గురువారం భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై 6.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం వెల్లడించింది. లాస్ ఏంజిల్స్ పట్టణానికి ఈశాన్యంలో 320 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. అయితే పలు భవనాలు స్వల్పంగా ధ్వంసమవ్వగా.. ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భూకంప ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. రిక్టార్ స్కేల్‌పై 6.4గా నమోదైందని తెలిపారు. […]

కాలిఫోర్నియాలో భూకంపం.. రిక్టార్ స్కేల్‌పై 6.4 గా నమోదు

Edited By:

Updated on: Jul 05, 2019 | 7:28 AM

అమెరికాలోని కాలిఫోర్నోయాలో గురువారం భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై 6.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం వెల్లడించింది. లాస్ ఏంజిల్స్ పట్టణానికి ఈశాన్యంలో 320 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. అయితే పలు భవనాలు స్వల్పంగా ధ్వంసమవ్వగా.. ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భూకంప ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. రిక్టార్ స్కేల్‌పై 6.4గా నమోదైందని తెలిపారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us