వైరల్‌గా మారిన ఎంపీ గోరంట్ల మాధవ్ గుర్రపు స్వారీ..!

YCP MP Gorantla Madhav Horse Riding Video Goes Viral, వైరల్‌గా మారిన ఎంపీ గోరంట్ల మాధవ్ గుర్రపు స్వారీ..!

మగధీర మూవీ గుర్రం రేస్‌ సీన్‌ గుర్తుందా? తెలుగు సినిమా చరిత్రలో అలాంటి సీన్‌ ఎక్కడా చూడలేదు. అయితే.. ఇక్కడ చూడండి.. ఈ వీడియో చూశాక మగధీర-2 షూటింగ్‌ జరుగుతోందని అనిపిస్తుందా? అలా అనుకుంటే మీరు పొరబడ్డట్లే. ఈయన ఎవరో కాదు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌. నియోజకవర్గంలో పర్యటించిన ఆయన నల్లపరెడ్డిపల్లి నుంచి నల్లగొండవారిపల్లి మలుపు వరకు గుర్రంపై విహరించారు. సుధాకర్‌ అనే వ్యక్తికి చెందిన గుర్రంపై దాదాపు రెండు కిలోమీటర్ల వరకు స్వారీ చేశారు. ఆయన హార్స్ రైడింగ్ ఎంతో.. వేగంగా చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ స్పీడ్ చూస్తుంటే.. గోరంట్లకు గుర్రపు స్వారీ అంటే.. చాలా ఇష్టమని తెలుస్తోంది. ఆయన వెనకనే.. కాన్వాయ్.. కార్యకర్తలు, అభిమానులు వెంబడిస్తూ.. వచ్చారు. కాగా.. ఆయన ఇంతకు ముందు చాలా చార్లు హార్స్ రైడింగ్ చేసేవారని తెలుస్తోంది. కాగా.. అక్కడున్నవారు కొంత మంది ఎంపీ గుర్రం స్వారీని వీడియో తీశారు. దీనిని కాస్తా.. సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయగా.. కొద్ది నిమిషాల్లోనే ఫుల్‌గా వైరల్‌ అయ్యింది. దీనికి నెటిజన్లు వావ్.. సూపర్ అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. గోరంట్ల గట్స్‌కు అందరూ హాట్సాఫ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *