Bill Gates Meets Ex Girlfriend: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మిలిందా గేట్స్‌తో వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఇటీవల సంచలన ప్రకటన చేశారు. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని, అయితే సామాజిక కార్యక్రమాల్లో మాత్రం భాగస్వాములుగానే కొనసాగుతామని స్పష్టం చేశారు. తాజాగా బిల్‌గేట్స్‌కు సంబంధించి ఓ ఆశ్చర్యకరమైన వార్త ప్రస్తుతం అందరిని ఆకర్షిస్తోంది. ఏంటంటే బిల్ గేట్స్ ఏటా తన మాజీ గర్ల్ ఫ్రెండ్‌తో టూర్‌కు వెళ్తారట. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే దీని గురించి మిలిందా గేట్స్‌కు కూడా తెలుసట.
మిలిందాత వివాహానికి ముందు బిల్ గేట్స్, అన్ విన్‌బ్లాడ్ అనే మహిళను ప్రేమించుకున్నారు. కానీ ఆ తర్వాత మిలిందాను వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో బిల్ గేట్స్ వివాహానికి ముందే దీని గురించి మిలిందాతో చెప్పాడట. ప్రతి ఏటా వసంత కాలంలో తాను అన్ విన్‌బ్లాడ్‌తో టూర్ వెళ్తానని తెలిపాడట. అందుకు మిలిందా కూడా అంగీకరించింది అని సమాచారం.
గతంలో బిల్ గేట్స్ మిలిందాతో ఓ విచిత్రమైన ఒప్పందం చేసుకున్నారు. ఏడాదికి ఒకసారి తన మాజీ ప్రేయసి విన్ బ్లాడ్ ను కలిసి అవకాశం ఇవ్వాలనేది ఆ అగ్రిమెంట్. 1997 వరకు కూడా ఈ ఒప్పందం కొనసాగినట్లు ప్రచారం జరిగింది. ప్రతియేటా నార్త్ కరోలినాలోని విన్ బ్లాడ్ కు చెందిన బీచ్ కాటేజ్ లో ఇద్దరు కలుసుకునేవారు. వారం రోజులు పాటు చాలా సంతోషంగా గడిపేవారట. ఆ సమయంలో బీచ్ వెంబడి ఇద్దరూ ఒకరి చేయి మరొకరు పట్టుకుని తిరిగేవారని ప్రచారం ఉంది. దీనిపై విన్‌బ్లాడ్ స్పందిస్తూ మా ఇద్దరి మధ్య ఉన్న బంధం బయోటెక్నాలజీ మీద ఆసక్తి ఉన్న ఇద్దరు వేర్వేరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధం లాంటిది. ఈ టూర్లో మేం మా గురించి, ప్రపంచం గురించి చర్చించుకునేవాళ్లం. ఇక మిలిందా బిల్‌గేట్స్‌కు అన్ని విధాల తగిన భార్య అన్నారు.
ఆన్ విన్‌బ్లాడ్, శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ఓ ప్రైవేట్ పరిశోధకుడైన ఎడ్వర్డ్ అలెక్స్ క్లీన్ను వివాహం చేసుకుంది. అతను నేరాలు, మోసం, పౌర హక్కుల కేసులను విచారించే అలెక్స్ క్లైన్ ఇన్వెస్టిగేషన్ అండ్ రీసెర్చ్ సర్వీస్ యజమాని. విన్‌బ్లాడ్ ఒక సాఫ్ట్వేర్ వ్యవస్థాపకురాలు. 1997లో టైమ్స్ మ్యాగ్జైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ మాట్లాడుతూ.. విన్‌బ్లాడ్ నా కన్న ఐదేళ్లు పెద్దది. మిలిందాతో నా వివాహం గురించి ముందుగా విన్బ్లాడ్కే చెప్పాను. తన అంగీకరంతోనే నేను మిలిందాను వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు. విన్‌బ్లాడ్‌ను ప్రతి ఏటా ఒక్కసారి కలుస్తానని వివాహానికి ముందే మిలిందాకు చెప్పాను. తను కూడా అంగీకరించిందని బిల్‌గేట్స్ తెలిపారు.
ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ లో మార్పులు.. వివరాలివే..
Viral News: గగుర్పొడిచే దృశ్యం.. ఒకే చోట కుప్పలు తెప్పలుగా చేరిన పాములు.. వీడియో వైరల్.!
ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు చిరుతపులి నక్కింది.. అది ఎక్కడ ఉందో కనిపెట్టగలరా.?