Viral Video: సముద్రంలో అలల తాకిడికి కొట్టుకుపోతున్న వ్యక్తి.. సమయస్ఫూర్తితో కాపాడిన టూరిస్టులు..

|

Jan 06, 2022 | 6:14 PM

Viral Video: కొందరు తమ కళ్ళముందు ఎంత దారుణం జరుగుతున్నా మన వరకూ రాలేదు కదా.. మనకెందుకులే అంటూ చోద్యం చూసేవారు కొందరు..  తోటి మనిషి కష్టంలో ఉంటె.. శక్తికి మించి ..

Viral Video: సముద్రంలో అలల తాకిడికి కొట్టుకుపోతున్న వ్యక్తి.. సమయస్ఫూర్తితో కాపాడిన టూరిస్టులు..
Beachgoers Form Human Chain
Follow us on

Viral Video: కొందరు తమ కళ్ళముందు ఎంత దారుణం జరుగుతున్నా మన వరకూ రాలేదు కదా.. మనకెందుకులే అంటూ చోద్యం చూసేవారు కొందరు..  తోటి మనిషి కష్టంలో ఉంటె.. శక్తికి మించి సాయం చేసేవారు ఇంకొందరు. ఓ వ్యక్తి సముద్రంలో కొట్టుకుని పోతుంటే వెంటనే స్పందించిన పర్యాటకులు అతడిని కాపాడారు.. అవును కొంతమంది పర్యాటకులు స‌ముద్ర తీరంలో స్నానం చేస్తూ.. హాయిగా ఎంజాయ్ చేద్దామ‌ని బీచ్ కు వెళ్లారు. అయితే, వారిలో ఒక వ్యక్తి హఠాత్తుగా వచ్చిన  అల‌ల తాకిడికి స‌ముద్రంలోకి కొట్టుకుపోసాగాడు. ఈ విష‌యాన్ని గుర్తించిన తోటి పర్యాటకులు సకాలంలో స్పందించారు. సమయస్ఫూర్తిని ప్రదర్శించి.. సముద్రంలో కొట్టుకుపోతున్న ఆ వ్యక్తిని కాపాడారు. ప‌ర్యాట‌కులు వెంట‌నే మాన‌వ హారంగా ఏర్పడి.. ఆ వ్యక్తిని కాపాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.  ఈ ఘ‌ట‌న ఫిలిప్పీన్స్ లో  చోటు చేసుకుంది.

ఫిలిప్పీన్స్ లోని బిన్మలే బీచ్‌లో  సంతోషంగా గడపడానికి కొంతమంది ప‌ర్యాట‌కులు వ‌చ్చారు. అయితే అల‌ల తాకిడికి ఓ వ్యక్తి ప్రమాద‌వ‌శాత్తు.. స‌ముద్రంలోకి కొట్టుకుపోయాడు. మునిగిపోతోన్న వ్యక్తిని మిగ‌తా ప‌ర్యాట‌కులు గుర్తించారు. వెంట‌నే స్పందించి.. అతడిని కాపాడడానికి తోటి ప‌ర్యాట‌కులు అంతా క‌లిసి శ‌ర‌వేగంగా మాన‌వ హారం ఏర్పడ్డారు. మునిగిపోతున్న వ్యక్తికీ ఆసరా నిలిచి.. ఒడ్డుకు చేర్చారు. అతడిని కాపాడిన తీరుపై నెటిజన్లు ప్రశంస‌ల వర్షం కురిపిస్తున్నారు. ఇదికదా కలిసి ఉంటె వచ్చే బలం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

Also Read: ఆంటీతో ప్రేమ అన్న నెటిజన్స్‌కు అర్జున్ స్ట్రాంగ్ రిప్లై.. ఎవరి జీవితాలు వారివి..జీవించాలి.. జీవించనివ్వాలి అంటూ..
అమ్మ వీపే ఆ దివ్యాంగుడి ఆవాసం.. 26 ఏళ్ల కొడుకుని అన్నీ తానై సాకుతున్న తల్లి (photo gallery)