రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రికి కోవిడ్ పాజిటివ్.. సెల్ఫ్ ఐసోలేషన్ లోకి !

| Edited By: Anil kumar poka

Jul 18, 2021 | 1:16 PM

బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ తనకు కోవిడ్ పాజిటివ్ సోకిందని ప్రకటించారు. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా.. రిపోర్టులో నాకు పాజిటివ్ అని వచ్చిందన్నారు. అయితే...

రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రికి కోవిడ్ పాజిటివ్.. సెల్ఫ్ ఐసోలేషన్ లోకి !
Uk Health Secretary Sajid Javid Tests Covid 19 Positive
Follow us on

బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ తనకు కోవిడ్ పాజిటివ్ సోకిందని ప్రకటించారు. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా.. రిపోర్టులో నాకు పాజిటివ్ అని వచ్చిందన్నారు. అయితే స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జావిద్ 10 రోజులపాటు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాల్సి ఉంటుంది. పీసీఆర్ టెస్టులో ఈయనకు నెగెటివ్ అని తేలిన పక్షంలోనే తిరిగి ప్రభుత్వ విధులకు హాజరు కావలసి ఉంటుందని నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకటించింది. ఇటీవలి వరకు ప్రభుత్వంలో ఈయనతో కాంటాక్ట్ లో ఉన్నవారు కూడా టెస్ట్ చేయించుకోవాలని ఈ ఆరోగ్య శాఖ సూచించింది. ఈ నెల 16 న సాజిద్ 10 డౌనింగ్ స్ట్రీట్ (ప్రధాని అధికారిక నివాసం) కి వెళ్లినప్పటికీ ప్రధాని బోరిస్ జాన్సన్ తో నేరుగా ముఖాముఖి సమావేశమయ్యారా లేదా అన్నది తెలియడం లేదు. గతవారం పార్లమెంటులో కొందరు మంత్రులతో మాత్రం సాజిద్ సమావేశమయ్యారు.గత జూన్ 26 నుంచి ఈయన ఆరోగ్య శాఖ మంత్రి పదవిలో కొనసాగుతున్నారు.

మాజీ మంత్రి మాట్ హన్ కాక్…కరోనా వైరస్ ఆంక్షలను ఉల్లంఘించారని , పైగా ఓ మహిళతో ఎఫైర్ పెట్టుకున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ పదవిలో సాజిద్ నియమితులయ్యారు. బ్రిటన్ లో ప్రస్తుతం కోవిడ్ వీరవిహారం చేస్తోంది. రోజుకు కనీసం 50 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ సోమవారం నుంచి కోవిడ్ ఆంక్షలను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేస్తోంది. జనాభాలో చాలామంది వ్యాక్సిన్ తీసుకున్నందున ఇక ఆంక్షలు ఎత్తివేస్తామని ఇదివరకే ప్రకటించింది.

మరిన్ని ఇక్కడ చూడండి : హైదరాబాద్ లో ఆశర్యం..!బాబోయ్…సమాధి కింద శవం..! పదేళ్లయినా చెక్కుచెదరని శరీరం..:Hyderabad.

 వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు గ్రేట్ గుడ్ న్యూస్.. వచ్చే రెండేళ్లపాటు రిమోట్ పని..:Knowlodge Video.

 బామ్మకు మనవరాలి అరుదైన సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌..!ఆనందంతో ఎం చేసిందో తెలుసా..!:Rare Gift to Grandma Video.

 Viral Video: ఒలింపిక్‌ కిట్‌తో సానియా డ్యాన్స్‌ అదుర్స్‌…వైరల్ అవుతున్న వీడియో..:Sania Mirza Dance Video.