UK Covid-19 Positive Case: కలవరపెడుతున్న కరోనా వైరస్‌.. లండన్‌లో లక్ష దాటిన కరోనా మరణాలు

|

Jan 27, 2021 | 5:32 AM

UK Covid-19 Positive Case: లండన్‌లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. యూకేలో పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు అధికంగా ఉన్నాయి. ముందే కరోనా ...

UK Covid-19 Positive Case: కలవరపెడుతున్న కరోనా వైరస్‌.. లండన్‌లో లక్ష దాటిన కరోనా మరణాలు
Follow us on

UK Covid-19 Positive Case: లండన్‌లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. యూకేలో పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు అధికంగా ఉన్నాయి. ముందే కరోనా మహమ్మారితో సతమతం అవుతుంటే కొత్త రకం స్ట్రెయిన్‌ వైరస్‌తో మరింత భయాందోళన కలిగిస్తోంది. కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌కు కేంద్రంగా మారిన యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో మృతుల సంఖ్య లక్ష దాటింది. యూరప్‌లో వైరస్‌తో తీవ్రంగా ప్రభావితమైన ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌లోనూ ఈ స్థాయిలో మరణాలు సంభవించలేదు. ప్రపంచంలో లక్షపైగా మరణాలు నమోదైన ఐదో దేశం యూకే. దేశంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 36.70 లక్షలు. దీని ప్రకారం మరణాల రేటు 2.72గా ఉంది. దాదాపు రెండు నెలలుగా యూకేలో కొత్త రకం స్ట్రెయిన్‌ తీవ్రత ఉంది. 70 శాతం వేగంగా వ్యాపించే ఈ కొత్త రకం వైరస్‌ కారణంగా 40 వేల మందికి వరకు పాజిటివ్‌ నిర్ధారణ అవుతోంది. మంగళవారంతో ప్రపంచ కేసులు 10 కోట్లు దాటాయి. ఇందులో అమెరికా 2.60 కోట్లు.

కాగా, కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకువచ్చారు పరిశోధకులు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగా,కొన్ని వ్యాక్సిన్లు ప్రయోగదశలో ఉన్నాయి. మరి కొన్ని నెలల్లో వ్యాక్సిన్‌ ప్రపంచ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

Also Read: World Wide Covid 19: ప్రపంచ దేశాల్లో కొనసాగుతున్న కరోనా కల్లోలం.. 10కోట్లు దాటిన పాజిటివ్ కేసులు, 21లక్షలు దాటిన మరణాలు