World Wide Covid 19: ప్రపంచ దేశాల్లో కొనసాగుతున్న కరోనా కల్లోలం.. 10కోట్లు దాటిన పాజిటివ్ కేసులు, 21లక్షలు దాటిన మరణాలు

చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజుకో రూపాన్ని సంతరించుకుని విశ్వ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తుంది. ఏడాది క్రితం వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్..

World Wide Covid 19: ప్రపంచ దేశాల్లో కొనసాగుతున్న కరోనా కల్లోలం.. 10కోట్లు దాటిన పాజిటివ్ కేసులు, 21లక్షలు దాటిన మరణాలు
Follow us

|

Updated on: Jan 26, 2021 | 2:07 PM

World Wide Covid 19: చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజుకో రూపాన్ని సంతరించుకుని విశ్వ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తుంది. ఏడాది క్రితం వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ మనుషులపైనే కాదు. ఆర్ధిక రంగంపై కూడా తన ప్రభావం చూపిస్తోంది. ఓ వైపు కరోనా వ్యాప్తిని అరికట్టడానికి నివారణ చర్యలు తీసుకుంటే.. మరోవైపు అనేక దేశాలు వ్యాక్సినేషన్ ను కొనసాగియిస్తున్నాయి.

తాజాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 10 కోట్లు దాటాయి. గత 24 గంటల్లో 4,29,879 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 10,03,00,064కి చేరుకుంది. ఇక గడిచిన 24గంటల్లో 9,272 మంది కరోనాతో చనిపోవడం వల్ల మొత్తం మరణాల సంఖ్య 21,50,042కి చేరుకుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,58,64,417 ఉన్నాయి. ఇప్పటి వరకూ ఈ వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 7,23, 43,692లకు చేరుకుంది.

మరోవైపు అగ్రరాజ్యం అమెరికాలో తాజాగా 1,36,224 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసులు 2.58 కోట్లు దాటాయి. తాజాగా 1,706 మంది చనిపోవడంతో… మొత్తం మరణాలు 4.31లక్షలకు చేరుకున్నాయి. పాజిటివ్ కేసుల్లో అగ్రస్థానంలో అమెరికా కొనసాగుతుండగా.. ఇండియా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా తర్వాత స్పెయిన్ (38,682) రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత బ్రెజిల్, బ్రిటన్, రష్యా ఉన్నాయి.

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన సమయంలో కనీసం మాస్క్ లు కూడా సరిగ్గా లేని స్టేజ్ నుంచి ఇప్పుడు ప్రపంచాలు వ్యాక్సిన్ ను సరఫరా దిశగా భారత్ అడుగులు వేసింది. కరోనా వైరస్‌పై పోరాటంలో భారత్ అన్ని దేశాల కంటే ముందంజ లో ఉంది. ప్రపంచ దేశాల ప్రశంసలు పొందుతోంది. ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైన 10 రోజుల్లో 16 లక్షల మంది దాకా హెల్త్ కేర్ వర్కర్లకు టీకాలు వేశారు. అమెరికా, బ్రిటన్ కంటే ఇండియాలోనే త్వరగా వ్యాక్సిన్లు వేస్తున్నారు.

Also Read: చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు .. పాల్గొన్న చిరంజీవి, రామ్ చరణ్, నాగబాబు

విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..