Trump riots Democrats Plan:ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి తొలగిపోవాలని డెమొక్రాట్ల డిమాండ్..

|

Jan 09, 2021 | 8:13 AM

అమెరికా రాజధానిలో అల్లర్ల జరగడానికి ట్రంప్ పాత్ర ఉందని డెమొక్రాట్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన తీర్మాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నానికి..

Trump riots Democrats Plan:ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి తొలగిపోవాలని డెమొక్రాట్ల డిమాండ్..
Follow us on

Trump Riots-Democrats Plan: ప్రజాస్వామ్య దేశం అగ్రరాజ్యం అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో బుధవారం ట్రంప్ అనుచరులు సృష్టించిన విధ్వంసంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అల్లర్ల జరగడానికి ట్రంప్ పాత్ర ఉందని డెమొక్రాట్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన తీర్మాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వెంటనే రాజీనామా చేయకపోతే తాము అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టాల్సి వస్తుందని స్పీకర్ నాన్సీ పెలోసి చెప్పారు. అంతేకాదు అమెరికా కాంగ్రెస్‌పై తిరుగుబాటుకి ప్రేరేపింపించి, ట్రంప్ ఐదుగురు మృతికి కారణమయ్యారని డెమొక్రాట్లు ఆరోపించారు. తాము సోమవారం ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. మరోవైపు ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఉపాధ్యక్షుడు పెన్స్‌కు హౌజ్ జ్యుడిషియరీ కమిటీ డెమొక్రాట్లు లేఖ రాశారు. మన ప్రజాస్వామ్య ప్రతిష్ఠను దెబ్బ తీసే విధంగా ట్రంప్ చొరబాట్లను ప్రేరేపించారని వారు ఆ లేఖలో ఆరోపించారు. ఇదే అంశంపై అగ్రరాజ్యం నూతన అధ్యక్షడిగా ఎన్నిలకైన జో బిడెన్ స్పందిస్తూ.. ట్రంప్ అధ్యక్ష పదవికి అనర్హుడన్నారు.

మరోవైపు అభిశంసన అంశంపై హౌస్ స్పందించింది. ఇది రాజకీయంగా ప్రేరేపించబడిన చర్య అంటూ అభివర్ణించింది. నిజానికి ఈ పక్రియ ముందుకు సాగితే, అధ్యక్షుడు ట్రంప్‌పై ప్రతినిధుల సభ నుంచి అభిశంసనను ఎదుర్కోవడం రెండోసారి అవుతుంది. అమెరికా పార్లమెంట్ మీద ట్రంప్ మద్దతుదారులు ముట్టడి అనంతరం ట్రంప్‌ను పదవి నుంచి తప్పించడానికి అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ ఉపయోగించవచ్చా అన్న చర్చ మొదలైంది.

Also Read:
ఇప్పటికే బర్డ్ ఫ్లూ 6 రాష్ట్రాలకు వ్యాప్తి.. దేశ రాజధానిలో మరణించిన పక్షులు .. కేంద్రం అలర్ట్