AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్, కిమ్ కలిసిపోయి.. హిస్టరీ క్రియేట్ చేశారు.. !

అమెరికా, నార్త్ కొరియా మధ్య ఇన్నాళ్లూ పచ్ఛగడ్డి వేస్తే భగ్గుమంటూ ఉండేది.. ఇరు దేశాల అధ్యక్షులు ట్రంప్, కిమ్ ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటూ వచ్ఛేవారు. ఒక దశలో రెండు దేశాల మధ్య వార్ సూచనలు కూడా కనిపించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ట్రంప్, కిమ్ ఇద్దరూ స్నేహ హస్తాన్ని చాటుకుంటున్నారు. ట్రంప్.. తమ దేశాలను వేరు చేస్తున్న నార్త్, సౌత్ కొరియన్ టెరిటరీ కాంక్రీటు బ్లాకులను దాటుకుని కిమ్ ని కలుసుకున్నారు. అందులోనూ డీమిలిటరైజ్డ్ […]

ట్రంప్, కిమ్ కలిసిపోయి.. హిస్టరీ క్రియేట్ చేశారు.. !
Pardhasaradhi Peri
|

Updated on: Jun 30, 2019 | 4:40 PM

Share

అమెరికా, నార్త్ కొరియా మధ్య ఇన్నాళ్లూ పచ్ఛగడ్డి వేస్తే భగ్గుమంటూ ఉండేది.. ఇరు దేశాల అధ్యక్షులు ట్రంప్, కిమ్ ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటూ వచ్ఛేవారు. ఒక దశలో రెండు దేశాల మధ్య వార్ సూచనలు కూడా కనిపించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ట్రంప్, కిమ్ ఇద్దరూ స్నేహ హస్తాన్ని చాటుకుంటున్నారు. ట్రంప్.. తమ దేశాలను వేరు చేస్తున్న నార్త్, సౌత్ కొరియన్ టెరిటరీ కాంక్రీటు బ్లాకులను దాటుకుని కిమ్ ని కలుసుకున్నారు. అందులోనూ డీమిలిటరైజ్డ్ జోన్ లో వీళ్ళిద్దరూ చేతిలో చెయ్యి వేసుకుని నడుచుకుంటూ కెమెరాలకు పోజులిచ్చారు. ఇదొక చరిత్రాత్మక పరిణామం. అమెరికా అధ్యక్షుడు నార్త్ కొరియాను విజిట్ చేయడం ఇదే మొదటిసారి. కిమ్ తో చేతులు కలిపిన ట్రంప్.. ఈ నిస్సైనికీకరణ రేఖ వద్ద తాను ఉండడం గర్వకారణమని అన్నారు. వీరిద్దరితోను దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్-జే-ఇన్ భేటీ కావడం విశేషం. కాగా-ఇది ప్రపంచానికే గొప్ప దినమని, ఇక్కడికి రావడం తనకు గౌరవప్రదమే కాక.. ఈ దేశంలో ఎన్నో అద్భుతమైన పనులు జరుగుతున్నాయని ట్రంప్ చమత్కరించారు.

అమెరికా-ఉత్తర కొరియా మధ్య అణు ఒప్పంద అంశంలో ప్రతిష్ఠంభన నెలకొనడంతో దీని పరిష్కారానికి ట్రంప్ శనివారం నాడు.. కిమ్ కు ఆహ్వానం పంపుతూ తన ట్విటర్ లో ట్వీట్ చేశారు. ‘ మేం ఇద్దరం చెయ్యీ..చెయ్యీ కలుపుకుంటాం.. వియత్నాం సమస్య అనంతరం మేము ఒకరినొకరం కలుసుకోనేలేదు ‘ అని ఆయన పేర్కొన్నారు. జీ-20 సమ్మిట్ సందర్భంగా జపాన్ లోని ఒసాకాలో ఉన్నప్పుడు ట్రంప్ ఈ మేరకు ట్వీటించారు. ఈ ట్వీట్ అందిన కొన్ని గంటల్లోనే నార్త్ కొరియా విదేశాంగ ఉప మంత్రి చోసన్-హూ ‘ ఇది మంచి సూచన ‘ అని అభివర్ణించారు. అటు-నార్త్ కొరియా-అమెరికా మధ్య సౌహార్ద, స్నేహపూరిత వాతావరణం ఏర్పడడం వల్ల ఈ ఖండంలో శాంతి నెలకొంటుందని దక్షిణ కొరియా అధినేత పేర్కొన్నారు. ఇక కిమ్ కూడా… ట్రంప్ రాక పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమ రెండు దేశాలూ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకోగలవని ఆశిస్తున్నట్టు వ్యాఖ్యానించారు.

Follow Us
పుట్టిన కొన్ని గంటల్లో తేడా.. ఆడ శిశువులు ముఖాలనే ఎక్కువగా చూస్తా
పుట్టిన కొన్ని గంటల్లో తేడా.. ఆడ శిశువులు ముఖాలనే ఎక్కువగా చూస్తా
పూజలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా? ఇలాంటి గంట శుభప్రదమట!
పూజలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా? ఇలాంటి గంట శుభప్రదమట!
కాంస్య పతకంతో సరిపెట్టుకున్న పురుషుల బ్యాడ్మింటన్ టీమ్
కాంస్య పతకంతో సరిపెట్టుకున్న పురుషుల బ్యాడ్మింటన్ టీమ్
అరెరె.. గుడ్లను ఉడికించేటప్పుడు ఇలా అవుతుందా.. అసలు కారణం ఇదే..
అరెరె.. గుడ్లను ఉడికించేటప్పుడు ఇలా అవుతుందా.. అసలు కారణం ఇదే..
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
సూతకం లేదా పాతకం సమయంలో గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? ఈ నియమాలు..
సూతకం లేదా పాతకం సమయంలో గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? ఈ నియమాలు..
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూళ్లకు సెలవు..
విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూళ్లకు సెలవు..
వాయుగుండంకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్..
వాయుగుండంకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్..
గ్యాస్, అజీర్తి, బీపీకి చెక్ పెట్టే 'వామాకు రోటి పచ్చడి..
గ్యాస్, అజీర్తి, బీపీకి చెక్ పెట్టే 'వామాకు రోటి పచ్చడి..