Japan PM: కుప్పకూలిన జపాన్ ప్రభుత్వం.. ఫ్యూమియో కిషిడా స్థానంలో ప్రధానిగా షిగెరు ఇషిబా

|

Oct 01, 2024 | 6:41 PM

జపాన్ 102వ ప్రధానమంత్రిగా ఇషిబా షిగేరు నియమితులయ్యారు. మాజీ ప్రధాని ఫుమియో కిషిడా ఈ ఉదయం తన మంత్రివర్గానికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

Japan PM: కుప్పకూలిన జపాన్ ప్రభుత్వం.. ఫ్యూమియో కిషిడా స్థానంలో ప్రధానిగా షిగెరు ఇషిబా
Japan Pm Shigeru Ishiba
Follow us on

జపాన్‌లో అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి. ఆ దేశ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు మంత్రివర్గం మొత్తాన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత వేగంగా రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఆయన స్థానంలో కొత్త ప్రధానిగా షిగెరు ఇబగ ఎన్నికయ్యారు.

జపాన్ 102వ ప్రధానమంత్రిగా ఇషిబా షిగేరు నియమితులయ్యారు. మాజీ ప్రధాని ఫుమియో కిషిడా ఈ ఉదయం తన మంత్రివర్గానికి సమిష్టిగా రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కిషిడా మరియు అతని మంత్రులు రాజీనామా చేసినట్లు జపాన్ మీడియా పేర్కొంది.

2021 నవంబర్ 1వ తేదీన జపాన్ ప్రధానిగా ఫ్యుమియో కిషిడా బాధ్యతలను స్వీకరించారు. ఈ రెండున్నర సంవత్సరాల పరిపాలనలో కిషిడా అనేక కుంభకోణాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు సైతం లభించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామాకు ఆమోద ముద్ర లభించింది. ఆ వెంటనే అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ తమ కొత్త నాయకుడిని ఎన్నుకుంది. కాబోయే ప్రధానమంత్రిగా షిగెరు ఇబగ పేరును ప్రతిపాదించింది. దీంతో ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేసినట్లు అక్కడి మీడియా తెలిపింది.

అక్టోబర్ 1 మంగళవారం ఉదయం ఫ్యుమియో కిషిడా ఆకస్మికంగా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఆ వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. కేబినెట్‌ను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని మంత్రివర్గ ముఖ్య కార్యదర్శి యొషిమష హయాషీ ప్రకటించారు. మంత్రివర్గం మొత్తం రద్దయినట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సరైన నిర్ణయాలను తీసుకోలేకపోవడం, మధ్య ఆసియాలో జపాన్‌ను శక్తిమంతమైన దేశంగా నిలబెట్టలేకపోవడం, ఆర్థిక వ్యవస్థ దిగజారుతుండటం, నిరుద్యోగం.. వంటి కీలకాంశాలపై ఫ్యుమియో కిషిడా చురుగ్గా వ్యవహరించలేకపోయారనే అభిప్రాయాలు ఉన్నాయి.

ఇదిలావుంటే, కొత్త ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోవడానికి లిబరల్ డెమొక్రటిక్ పార్టీ పలు పేర్లను పరిశీలనలోకి తీసుకుంది. మెజారిటీ నాయకులు షిగెరు ఇబగ అభ్యర్థిత్వం వైపే మొగ్గు చూపారు. కాగా, కొత్త మంత్రివర్గ ఏర్పాటుకు అప్పుడే సన్నాహాలు మొదలయ్యాయి. దీనికోసం కొన్ని పేర్లను సూచించింది లిబరల్ డెమొక్రటిక్ పార్టీ. ఇక,
పర్యావరణ శాఖ మంత్రిగా షింజిరో కొయిజుమి, విదేశాంగ శాఖ మంత్రిగా టకెషి ఇవాయా, రక్షణ శాఖ చీఫ్ జనరల్ నటకని అపాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..