Israel-Iran War: అజ్ఞాతం వీడిన ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేని.. ఏకంగా గన్‌ పట్టుకుని..

|

Oct 04, 2024 | 9:45 PM

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేని.. దేశ రాజధాని టెహ్రాన్‌లో, శుక్రవారం ప్రార్థనల సందర్భంగా స్పీచ్‌ ఇచ్చారు. ఇజ్రాయెల్‌ ఆయనను టార్గెట్‌ చేసిందనే వార్తల నేపథ్యంలో కొద్ది రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. అయితే తొలిసారిగా ఆయన బయటకు వచ్చిన దృశ్యాల్లో గన్‌ పట్టుకుని ఖమేని స్పీచ్‌ ఇవ్వడం విశేషం.

Israel-Iran War: అజ్ఞాతం వీడిన ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేని.. ఏకంగా గన్‌ పట్టుకుని..
Ayatollah Ali Khamenei
Follow us on

చేతిలో గన్‌. నోటి వెంట బుల్లెట్ల లాంటి డైలాగులు. ఇజ్రాయెల్‌ను లేపేస్తామంటూ వార్నింగులు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌… గన్‌తో ప్రత్యక్షం అవడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేని… ఈమధ్య కాలంలో తొలిసారిగా బయట కనిపించారు. అది కూడా ఓ గన్‌ పట్టుకుని ఆయన బయటకు అడుగు పెట్టారు. ఖమేనిని ఇజ్రాయెల్‌ టార్గెట్‌ చేసిందనే వార్తల నేపథ్యంలో కొద్ది రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. దేశ రాజధాని టెహ్రాన్‌లో…ఓ మసీదులో శుక్రవారం జరిగిన ప్రార్థనల సందర్భంగా…తన మద్దతుదారులను ఉద్దేశించి ఖమేని ప్రసంగించారు.

అయితే తాజా దృశ్యాల్లో రష్యా తయారు చేసిన డ్రాగనోవ్‌ రైఫిల్‌ పట్టుకుని ఖమేని స్పీచ్‌ ఇవ్వడం విశేషం. ఖమేని గన్‌ పట్టుకుని కనిపించడం…ఇజ్రాయెల్‌తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామనే అర్థం వచ్చేలా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది ఇజ్రాయెల్‌కి, దాని మిత్ర పక్షాలకు ఖమేని పంపించిన సంకేతమని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయిన ఖమేని, మత గురువు కూడా. ఇజ్రాయెల్‌ దాడులు చేస్తుందేమోనని భయపడుతున్న ఇరానియన్లలో ధైర్యం, ఉత్తేజం నింపడానికి కూడా, ఆయన గన్‌ పట్టుకుని కనిపించి ఉండవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చేతిలో గన్‌తో ఖమేని కనిపించడం మాత్రం…రాబోయే యుద్ధానికి సంకేతంగా ఇరానియన్లు భావిస్తున్నారు.

వీడియో చూడండి..

ఇజ్రాయెల్‌ ఎంత దూకుడు ప్రదర్శించినా, ఇరాన్‌ వెనక్కి తగ్గేదే లేదంటున్నారు ఖమేని. ఇజ్రాయెల్‌ని మట్టి కరిపిస్తామని హెచ్చరించారు. ఆ దేశంపై తాము జరిపిన బాలిస్టిక్‌ మిస్సైళ్ల దాడిని ఖమేని సమర్థించుకున్నారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న హమాస్‌, హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థలకు తమ మద్దతు కొనసాగుతుందన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..