‘వర్క్ ఫ్రమ్ హోమ్‌’పై సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు..!

| Edited By:

May 18, 2020 | 5:09 PM

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక లాక్‌డౌన్ ఎత్తేసినప్పటికీ కొన్ని బడా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పెంచుతున్నట్లు కూడా ప్రకటించాయి. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కోవడం కోసం ఇంటి నుంచే పనిచేయించుకోవాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్‌పై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. శాశ్వతంగా ఇంటి నుంచి పని చేయడం వల్ల ఉద్యోగులకు కీడు […]

వర్క్ ఫ్రమ్ హోమ్‌పై సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు..!
Follow us on

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక లాక్‌డౌన్ ఎత్తేసినప్పటికీ కొన్ని బడా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పెంచుతున్నట్లు కూడా ప్రకటించాయి. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కోవడం కోసం ఇంటి నుంచే పనిచేయించుకోవాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్‌పై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు.

శాశ్వతంగా ఇంటి నుంచి పని చేయడం వల్ల ఉద్యోగులకు కీడు జరుగుతుందని నాదెళ్ల అన్నారు. ఏవైనా సమావేశాలకు సంబంధించి ఎదురుగా కలవడానికి, ఆన్‌లైన్‌లో కలవడానికి చాలా తేడా ఉంటుందని ఆయన చెప్పారు. అంతేకాకుండా వర్క్ ఫ్రం హోం వల్ల ఉద్యోగులు, సమాజంలో కలవలేని పరిస్థితులు కూడా వస్తాయని వివరించారు. ఈ క్రమంలో వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపి ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. దీనివలన కంపెనీల్లోని చాలా నియమ నిబంధనలు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని ఆయన స్పష్టం చేశారు.

Read This Story Also: తాను.. నేను.. కాలం మారినా.. దేశం మారినా..!