Pakistan: పాకిస్తాన్ లో ఆగని ఆందోళనలు..హింసాత్మకంగా మారిన అల్లర్లు.. బందీలుగా పోలీసులు!

|

Apr 19, 2021 | 12:59 PM

పాకిస్తాన్ లో అతివాద ఇస్లామిక్ గ్రూప్ ఆందోళనలు మరో మలుపు తీసుకున్నాయి. ఫ్రాన్స్ లో మహమ్మద్ ప్రవక్తపై వ్యంగ్యంగా కార్టూన్లు ప్రదర్శించినందుకు గానూ ఈ గ్రూప్ పాకిస్తాన్ లో ఆందోళనలు చేస్తోంది.

Pakistan: పాకిస్తాన్ లో ఆగని ఆందోళనలు..హింసాత్మకంగా మారిన అల్లర్లు.. బందీలుగా పోలీసులు!
Pakistan
Follow us on

Pakistan: పాకిస్తాన్ లో అతివాద ఇస్లామిక్ గ్రూప్ ఆందోళనలు మరో మలుపు తీసుకున్నాయి. ఫ్రాన్స్ లో మహమ్మద్ ప్రవక్తపై వ్యంగ్యంగా కార్టూన్లు ప్రదర్శించినందుకు గానూ ఈ గ్రూప్ పాకిస్తాన్ లో ఆందోళనలు చేస్తోంది. ఫ్రాన్స్ రాయబారులను బహిష్కరించాలంటూ ఇస్లామిక్ గ్రూప్ తెహ్రీక్-ఐ-లబైక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ) పాక్ ప్రభుత్వానికి ఏప్రిల్ 20 వరకు గడువు విధించింది. ఈ ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న టీఎల్పీ నేత సాద్‌ హుస్సేన్ రిజ్వీ అరెస్ట్‌ చేశారు పాకిస్తాన్ పోలీసులు. దీంతో దేశవ్యాప్తంగా అల్లట్లు చెలరేగాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో 10 మందికి పైగా మరణించారు. 600 మంది పోలీసులు గాయాల పాలయ్యారు. ఇప్పుడు లాహోర్ లో ఎనిమిది మంది ఎనిమిది మంది భద్రతా సిబ్బందిని ఆందోళనకారులు బందీలుగా తీసుకున్నారు. వీరిలో ఒక సీనియర్ పోలీసు అధికారి, ఇద్దరు పారా మిలిటరీ సిబ్బంది ఉన్నారని లాహోర్ పోలీస్ అధికార అప్రతినిది ఆరిఫ్ రాణా చెప్పారు. టీఎల్పీ మద్దతుదారులు పెట్రోల్ టాంకర్లతో భద్రతా సిబ్బందిపై పెట్రోల్ బాంబులు విసురుతూ వీరంగం చేస్తున్నారని ఆయన వివరించారు. అంతేకాకుండా ఆందోళనకారులు కాల్పులు కూడా జరుపుతున్నారన్నారు. ఈ సంఘటనలో 11 మంది అధికారులు గాయపడ్డారు. ఈ సమయంలో చాలా మంది భద్రతా అధికారులను బందీలుగా తీసుకున్నారు టీఎల్పీ కార్యకర్తలు. అయితే, తరువాత కొంతమందిని వదిలిపెట్టారు.

ఈ ఘర్షణలపై టీఎల్పీ అధికార ప్రతినిధి ఒక ప్రకటన చేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో తమ కార్యకర్తలు నలుగురు చనిపోయారని అన్నారు. చాలామంది గాయపడ్డారని ఆ ప్రకటనలో ఆరోపణ చేశారు. ఫ్రెంచి రాయబారులను తమ దేశం నుంచి వెళ్ళకొట్టాల్సిందే అన్నారు. అప్పటివరకూ తమ ఆందోళనలు విరమించే ప్రసక్తి లేదని టీఎల్పీ నేత అల్లామా మొహమూద్ షఫీక్ అమినీ స్పష్టం చేశారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే..పోలీసులే తమపై దాడులకు దిగారని ఆయన ఆరోపించారు.

పంజాబ్ ప్రావిన్సుల ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫిర్దోయుస్ అషిక్ అవన్ మాట్లాడుతూ ఆందోళనకారులు 12 మంది భద్రతా సిబ్బందిని అపహరించి లాహోర్‌లోని టీఎల్పీ మసీదులో బంధించారని తెలిపారు. ఫ్రాన్స్ వ్యతిరేక ఆందోళనలు తారాస్థాయికి చేరడంతో తమ పౌరులంతా తక్షణమే స్వదేశానికి వచ్చేయాలని ఫ్రెంచ్ ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

Also Read: Egypt train Accident: ఈజిప్టులో పట్టాలు తప్పిన రైలు.. 11 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు

Texas Shooting: అమెరికాలో తీవ్రస్థాయికి చేరిన గన్ కల్చర్.. దుండగుడి కాల్పుల్లో మరో ముగ్గురు మృతి