
భారత్ లేదా అమెరికాలో ఏడాదికి కోటి రూపాయల వరకు సంపాదిస్తే, అసలు ఎంత మిగులుతుందనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే అమెరికాలో విపరీతంగా ఖర్చు అవుతోందని అన్ని ఖర్చులూ పోను చివరకు జీతం మిగలడం లేదని సేవింగ్స్ అనుకున్నంత లెవెల్ లో లేవని వాపోయాడు నితిన్. ఇంటి మార్ట్ గేజ్ రెంట్, పన్నుల కోత, ఆరోగ్య బీమా ప్రీమియం, ఫుడ్ కోసం ఖర్చు చేయడం వంటి వాటి తర్వాత నెల చివరకు మిగిలేది చాలా కొద్ది మొత్తమేననీ చెప్పుకొచ్చాడు. నితిన్ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతూ ఆదాయం సేవింగ్స్ పై కొత్త చర్చకు దారి తీసింది. అమెరికాలో ఉండే ఖరీదైన జీవనశైలికి ఆ మాత్రం ఖర్చు చేయాలని ఇండియాతో పోల్చలేమని ఆ వ్యవహారమే వేరని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
అతని నెలవారీ సంపాదన సుమారు రూ. 7.63 లక్షలు ($8,000) అయితు ఇంటి మార్ట్‌గేజ్ కింద ప్రతినెలా సుమారు రూ. 2.38 లక్షలు ($2,500) ఖర్చవుతుంది. పన్నుల రూపంలో మరో రూ. 1.43 లక్షలు ($1,500) కోత పడుతుంది. కార్ల ఇన్సూరెన్స్, కుటుంబ ఆరోగ్య బీమా కోసం మరో రూ. 95,000 ($1,000) పోతుంది. ఇక వంట సామాను ఇతర ఖర్చులు నెలకు దాదాపు రూ. 95,000 నుండి రూ. 1.14 లక్షల ($1,000 – $1,200) వరకు ఖర్చు అవుతాయి. ఇతర వైద్య ఖర్చులు, బిల్లులు పోను చివరికి మిగిలేది కేవలం రూ. 95,000 నుండి రూ. 1.14 లక్షలు ($1,000 – $1,200) మాత్రమే!
భారత్‌లో తనకు ఏటా రూ. 25 లక్షల జీతం వచ్చినప్పుడు పరిస్థితి వేరుగా ఉండేదని నితిన్ మల్హోత్రా చెప్పుకొచ్చాడు. అప్పట్లో ఇంటి అద్దె రూ. 30,000 మాత్రమే ఉండేదనీ రోజువారీ ఖర్చులు తక్కువగా ఉండటంతో నెలకు రూ. 1 లక్ష నుంచి రూ. 1.25 లక్షల వరకు దాచుకునేవాడిని అన్నాడు. అటు అమెరికా, ఇటు భారత దేశాలకు సంబంధించి ప్రత్యేకించి మెట్రో నగరాలకు, టైర్ 2, టైర్ 3 నగరాల జీవనశైలి, ఖర్చులు, సేవింగ్స్ విషయాలలో పోలికలపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
టెక్ రంగంలో పనిచేసే చాలా మంది నిపుణులు అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కంటుంటారు. అక్కడ జీతాలు భారీగా ఉంటాయని, జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ, అక్కడి జీవన వ్యయాలు, పన్నుల (ట్యాక్సులు) భారం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది కేవలం డబ్బు సంపాదించడం కోసమే కాకుండా, గ్లోబల్ వర్క్ కల్చర్‌ను అనుభవించడానికి యూఎస్‌కు వెళ్తుంటారు. కెరీర్‌లో వేగంగా ఎదగాలనే లక్ష్యంతో కూడా ఎంతోమంది అమెరికా బాట పడుతుంటారు.