Nobel Prize 2024: వైద్యశాస్త్రంలో నోబల్ బహుమతి.. ఎవరికంటే?

|

Oct 07, 2024 | 4:14 PM

మైక్రోఆర్‌ఎన్‌ఏ( microRNA )ను కనుగొన్నందుకు, పోస్ట్ ట్రాన్స్‌క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్‌‌లొ దాని పాత్రను  కనుగొన్నందుకు విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారం 2024 లభించింది. ఈ అవార్డును స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో వైద్యశాస్త్రంలో వారికి నోబల్ టిమ్ వెల్లడించింది.

Nobel Prize 2024: వైద్యశాస్త్రంలో నోబల్ బహుమతి.. ఎవరికంటే?
Nobel Prize 2024
Follow us on

మైక్రోఆర్‌ఎన్‌ఏ( microRNA )ను కనుగొన్నందుకు, పోస్ట్ ట్రాన్స్‌క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్‌‌లో దాని పాత్రను  కనుగొన్నందుకు విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారం 2024 లభించింది. ఈ అవార్డును స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో వైద్యశాస్త్రంలో వారికి నోబల్ టిమ్ వెల్లడించింది. 2023లో కాటలిన్‌ కరిక, డ్రూ వెయిస్‌మన్‌ (Drew Weissman)లకు కోవిడ్ వ్యాక్సిన్‌ కోసం కృషి చేశారు. దీంతో 2023లో వైద్యశాస్త్రంలో వారికి పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ వైద్యరంగంలో 114 సార్లు నోబల్ పురస్కారాన్ని నోబల్ బృందం ప్రకటించింది. ఈ పురస్కారాలు 227 మందికి వరించింది. ఈ పురస్కారం అందుకున్న వారిలో మహిళలు కేవలం 13 మంది మాత్రమే ఉండడం విశేషం.

 

ఈ నోబల్ పురస్కారం ఇవ్వడం వైద్య విభాగంతో ప్రారంభమైంది. ఇది ఈ నెల 14 వరకు జరగుతుంది. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, సాహిత్య విభాగంలో రోజుకు కొంతమందిని నోబల్ బృందం ప్రకటించబోతుంది. అలాగే ఈ శనివారం రోజున శాంతి బహుమతిని, ఈ నెల 14న అర్థశాస్త్రంలో నోబల్ పురస్కారలను ప్రకటిస్తారు. ఈ అవార్డును స్వీడన్‌కు చెందన శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ నోబెల్ పురస్కారాన్ని ఆయన ట్రస్ట్ అందజేస్తుంది. ఈ అవార్డు అందుకున్న వారికి రూ.10లక్షల డాలర్ల నగదు కూడా అందజేస్తారు. డిసెంబర్ 10న ఈ అవార్డులను గ్రహీతలకు అందజేస్తారు.