Kim Jong-un: నార్త్ కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ గాయపడ్డాడా..? మిస్టరీ స్పాట్, బ్యాండేజీతో కనబడిన నేత

| Edited By: Anil kumar poka

Aug 04, 2021 | 10:20 AM

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గాయపడి ఉండవచ్చునన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కొరియన్ పీపుల్స్ ఆర్మీ ఈవెంట్ కి హాజరైన ఈయనను చూసినప్పుడు అందరికీ ఇదే అనుమానం కలిగింది. మిస్టరీ స్పాట్ తో బాటు ఆయన మెడ వెనుక భాగంలో...

Kim Jong-un: నార్త్ కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ గాయపడ్డాడా..? మిస్టరీ స్పాట్, బ్యాండేజీతో కనబడిన నేత
Kim Jong Un Seen With Mystery Spot
Follow us on

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గాయపడి ఉండవచ్చునన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కొరియన్ పీపుల్స్ ఆర్మీ ఈవెంట్ కి హాజరైన ఈయనను చూసినప్పుడు అందరికీ ఇదే అనుమానం కలిగింది. మిస్టరీ స్పాట్ తో బాటు ఆయన మెడ వెనుక భాగంలో చిన్నపాటి బ్యాండేజీలు కనబడ్డాయి. గత నెలలో పొలిట్ బ్యూరో సమావేశానికి హాజరయినప్పుడు గానీ, అంతకు ముందు మ్యూజిషియన్ల తో నిర్వహించిన కార్యకమానికి అటెండ్ అయినప్పుడు గానీ ఈ గుర్తులు కనిపించలేదు. బహుశా ఆయన తన నివాసంలో ఎక్కడైనా జారి పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. అయితే కిమ్ ఆరోగ్యం బేషుగ్గా ఉందని, ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేవని యాన్ హాఫ్ న్యూస్ సర్వీస్ తెలిపింది. ఆయన హెల్త్ పై వస్తున్న వార్తలన్నీ రూమర్సే అని పేర్కొంది. ఏది ఏమైనా ఆయన బరువు తగ్గి సన్నబడినట్టు మాత్రం కొరియన్ వర్గాలు అంటున్నాయి. చాలా ఫోటోలు..వీడియోల్లో కిమ్ మరి ఇలాగే కనిపిస్తున్నారు.

ఇటీవలి కాలంలో తమ దేశంలో కోవిడ్ పరిస్థితి, క్షీణిస్తున్న ఆర్ధిక వ్యవస్థలపై ఆయన తీవ్ర ఆవేదనగా ప్రసంగించారు. పైగా గత నెలలో కొంతమంది సీనియర్ అధికారులను తొలగించి కొత్తవారిని ఆ పదవుల్లో నియమించారు. తమ విధుల్లో అలసత్వం వహించారని పాతవారిని డిస్మిస్ చేసిన కిమ్..పాలనా సంస్కరణలను మరింత పకడ్బందీగా చేపడుతామని ప్రకటించారు. ఏమైనా ఆయన మెడ వెనుక భాగంలో కనబడిన చిన్నపాటి బ్యాండేజీలు మాత్రం ఏదో కొత్త విషయాన్నీ చెప్పకనే చెప్పాయని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి : ఛాయ్‌ అమ్మిన ఎమ్మెల్యే…ఒక్క ఛాయ్ 15 లక్షలు.. మీకు కావాలా..? ఎందుకో తెలుసా.?:MLA sold by Chai Video.

 వృద్ధురాలి భిక్షాటన.. కారణం నమ్మలేని నిజం.. బంధువు అని నమ్మినందుకు తగిన శాస్తి చేసాడు..:Kadapa video.

 తల్లిపాలే శిశువుకు అమృతం.. ముర్రుపాలే బిడ్డకు ఆరోగ్యం.. పిల్లలకు తల్లిపాలు ఎంతకాలం ఇస్తే మంచిది..!:Motherfeed video.

 పాపం వధువును కష్టపెట్టిన వరుడు..! రోడ్డుపైనే వరమాల సందడి.. చివరకి ఎం అయ్యింది..:Bride Viral Video