Jennifer Aniston: బరాక్ ఒబామాతో ఎఫైర్.. స్పందించిన నటి

|

Oct 06, 2024 | 11:25 AM

అగ్రదేశమైన అమెరికాను ప్రపంచ దేశాలు అనుసరిస్తాయి. అక్కడ ఏ వార్త జరిగినా, ఏ సంఘటన జరిగినా సెన్సేషనల్‌గా మారుతుంది. ముఖ్యంగా రూమర్స్ బాగా వ్యాప్తి చెందుతాయి. ఇటీవలే జెన్నిఫర్ అనిస్టన్ అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా మధ్య ఎఫైర్ నడుస్తుందని ఆరోపణలు వినిపించాయి.

Jennifer Aniston: బరాక్ ఒబామాతో ఎఫైర్.. స్పందించిన నటి
Jennifer Aniston Reaction O
Follow us on

Jennifer Aniston: అగ్రదేశమైన అమెరికాను ప్రపంచ దేశాలు అనుసరిస్తాయి. అక్కడ ఏ వార్త జరిగినా, ఏ సంఘటన జరిగినా సెన్సేషనల్‌గా మారుతుంది. ముఖ్యంగా రూమర్స్ బాగా వ్యాప్తి చెందుతాయి. ఇటీవలే జెన్నిఫర్ అనిస్టన్ అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా మధ్య ఎఫైర్ నడుస్తుందని ఆరోపణలు వినిపించాయి. తాజాగా ఈ రూమార్స్‌పై జెన్నిఫర్ అనిస్టన్ స్పందించారు. ఒబామాతో సంబంధం ఉందన్న వార్తలను కొట్టిపారేశారు. అమెరికాలోని ప్రముఖ మ్యాగజైన్‌లో ప్రచురింతమైన వార్తపై ఆమె ఘటుగా స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు. తను ఒబామాని ఒక్కసారి మాత్రమే కలిసినట్లు చెప్పారు. ఒబామా భార్య మిచెల్ తనకు తెలుసాని, ఒబామా కంటే అతన్ని భార్య తనకు క్లోజ్ అని చెప్పుకొచ్చారు.

అమెరికాలో త్వరలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరగనున్నాయి. నవంబర్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ చేసున్నారు. వీరిద్దరి మధ్య ప్రచారంలో మాటలు తూటలు పేలుతున్నాయి. ప్రచార సభలో తాము గెలిస్తే ఏ మార్పులు చేస్తామో, పనులు చేపడుతామో పేర్కొంటున్నారు. ఇటీవలే వీరిద్దరి మధ్య జరిగిన డిబేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కమలా హారిస్ మద్దతుగా బరాక్ ఒబామా ప్రచారం నిర్వహిస్తున్నారు. ట్రంప్‌కి మద్దతుగా టెస్లా వ్యవస్ధాపకుడు ఎలాన్ మస్క్ ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరుగబోతున్నాయి.