Anju Viral Video: బహుమతులు, ఇంటి స్థలం, ఉద్యోగం.. ఇండియన్ అంజూ ఇంటి ముందు పాకిస్తాన్ కంపెనీల క్యూ.. కారణం ఇదే..

|

Jul 31, 2023 | 8:02 AM

Anju Pakistan Love Story: రెండు దేశాల్లో సంచలనంగా మారడంతో  అంజు అకా ఫాతిమా, నస్రుల్లాలకు బహుమతులు ఇచ్చే ప్రక్రియ మొదలైంది. కుటుంబం, బంధువుల తర్వాత.. ఇప్పుడు పాకిస్తాన్‌కు చెందిన పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నాయి. తాజాగా పాకిస్తాన్‌కు చెందిన ఓ పెద్ద వ్యాపారవేత్త కూడా నస్రుల్లా, అంజులకు విలువైన ప్లాట్‌ను బహుమతిగా ఇచ్చాడు.

Anju Viral Video: బహుమతులు, ఇంటి స్థలం, ఉద్యోగం.. ఇండియన్ అంజూ ఇంటి ముందు పాకిస్తాన్ కంపెనీల క్యూ.. కారణం ఇదే..
India Anju
Follow us on

రాజస్థాన్‌లోని అల్వార్ నుంచి పాకిస్తాన్ చేరుకున్న అంజు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అక్కడికి వెళ్లిన తర్వాత ఇస్లాం మతంలోకి మారి ఫాతిమాగా పేరు మార్చుకుని తన ప్రేమికుడు నస్రుల్లాను పెళ్లి చేసుకుంది. ఈ వార్త రెండు దేశాల్లో సంచలనంగా మారడంతో  అంజు అకా ఫాతిమా, నస్రుల్లాలకు బహుమతులు ఇచ్చే ప్రక్రియ మొదలైంది. కుటుంబం, బంధువుల తర్వాత.. ఇప్పుడు పాకిస్తాన్‌కు చెందిన పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నాయి. తాజాగా పాకిస్తాన్‌కు చెందిన ఓ పెద్ద వ్యాపారవేత్త కూడా నస్రుల్లా, అంజులకు విలువైన ప్లాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఇతర మతాల నుంచి ఇస్లాంలోకి వచ్చే ప్రజలకు సౌకర్యాలు కల్పించడమే దీని వెనుక ఉద్దేశమని వ్యాపారవేత్త చెప్పాడం సంచలనంగా మారింది.

అంజు నుంచి ఫాతిమాగా మారిన భారతీయ మహిళకు పాకిస్థానీ వ్యాపారవేత్త ప్లాట్ బహుమతిగా ఇచ్చాడు. దీంతో పాటు చెక్కును కూడా అందజేశాడు. అయితే చెక్కులో ఎన్ని పాకిస్థానీ రూపాయిలు ఉన్నాయని పేర్కొనలేదు. రాజధాని ఇస్లామాబాద్ నుంచి ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని నస్రుల్లా ఇంటికి బహుమతితో వచ్చిన వ్యాపారవేత్త అంజు అలియాస్ ఫాతిమాకు తన కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు.

మరో దేశానికి చెందిన ఓ మహిళ ఇస్లాంను స్వీకరించిందని పాక్ స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈవో మొహ్సిన్ ఖాన్ అబ్బాసీ తెలిపారు. అందుకే ఆమెకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవడం తమ బాధ్యత అని.. పాకిస్థాన్‌లో ఎలాంటి కొరతను అనుభవించవద్దని చెప్పాడం.. ఆ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.

తన పాక్ సిటీ కంపెనీ రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తుందని వ్యాపారవేత్త అబ్బాసీ తెలిపాడు. అంజు అలియాస్ ఫాతిమా ఇంటి కోసం నగరంలో 10 మర్ల (272.251 చదరపు అడుగులు) స్థలం ఇవ్వాలని తమ కంపెనీ బోర్డు సభ్యులు నిర్ణయించినట్లుగా వెల్లడించాడు. దీంతో పాటు పాకిస్థాన్‌లో భారతీయ మహిళల పత్రాల చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన వెంటనే.. పాక్ స్టార్ గ్రూప్ ఆమెకు ఉద్యోగం కూడా ఇస్తుందని.. ఉద్యోగం చేసేందుకు ఆఫీసుకు కూడా రావల్సిన అవసరం లేదని.. ఇంట్లో కూర్చొని జీతం కూడా తీసుకోవచ్చంటూ చెప్పడం మరింత సంచలనంగా మారింది.

వీడియో ఇక్కడ చూడండి:-

రెండు రోజుల క్రితం అంజు తన భర్త అరవింద్‌కు ఫోన్ చేసి బెదిరించింది. భర్తతో అంజు మాట్లాడుతున్న ఆడియో కూడా వైరల్ అవుతోంది. ఇండియాలో ఉంటున్న తన భర్త అరవింద్‌కు ఫోన్ చేసింది. ఎవరి ఆడియో వైరల్ అయింది. వైరల్ అయిన ఆడియోలో.. అతను అరవింద్‌ను చెడుగా మాట్లాడాడు.. ఆ తర్వాత ఇద్దరికీ చాలా వాదనలు జరిగాయి. మీడియాలో ఏం నాన్సెన్స్ చేస్తున్నావ్.. ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నావంటూ అరవింద్‌తో అంజు మాట్లాడింది.

భర్తకు మాయమాటలు చెప్పి పాకిస్థాన్ వెళ్లింది

రాజస్థాన్‌లో నివసించే అరవింద్‌తో అంజు వివాహం జరిగింది. అతనికి 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అంజు మాయమాటలు చెప్పి పాకిస్థాన్‌కు వెళ్లిపోయిందని భర్త తెలిపాడు. పాకిస్థాన్‌కు చెందిన అంజుతో మొదట వీడియో షేర్ చేస్తూ.. పాకిస్తాన్‌లో తాను క్షేమంగా ఉన్నానని, వీసా తీసుకున్నానని చెప్పింది. తాను త్వరలో తిరిగి వస్తానంటూ చెప్పింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం