London Hyderabad Restaruant: లండన్‌లోని హైదరాబాద్‌ రెస్టారెంట్‌లో భారతీయ విద్యార్థినిపై కత్తితో దాడి..!

London Hyderabad Restaruant: నెల రోజుల క్రితం బ్రిటన్‌కు చేరుకున్న భారతీయ విద్యార్థిని ఓ రెస్టారెంట్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో అక్కిడకి వచ్చిన ఓ యువకుడు ఆమెపై.

London Hyderabad Restaruant: లండన్‌లోని హైదరాబాద్‌ రెస్టారెంట్‌లో భారతీయ విద్యార్థినిపై కత్తితో దాడి..!

Updated on: Mar 30, 2022 | 1:03 PM

London Hyderabad Restaruant: నెల రోజుల క్రితం బ్రిటన్‌కు చేరుకున్న భారతీయ విద్యార్థిని ఓ రెస్టారెంట్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో అక్కిడకి వచ్చిన ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈస్ట్ లండన్‌లోని హైదరాబాద్‌ బిర్యానీ రెస్టారెంట్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్న సదరు యువతిపై ఆ యువకుడు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడటంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో రంగంలోకి తీసుకున్న పోలీసులు దాడి చేసిన యువకున్ని అరెస్టు చేశారు. కేరళకు చెందిన విద్యార్థిని సోనా బిజు (23) యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ లండన్‌ లో విద్యనభ్యసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సోనా ఈస్ట్‌ హోమ్‌లో ఉన్న తినుబండారంలో పార్ట్‌టైమ్‌ ఉద్యోగిని. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా, 23 ఏళ్ల యువకుడు శ్రీరామ్‌ అంబర్లాను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. కేరళకు చెందిన సోనా, హైదరాబాద్‌కు చెందిన శ్రీరామ్‌ ఇద్దరు ఒకే యూనివర్సిటీ విద్యార్థులు. రెస్టారెంట్‌లోని సీసీటీవీ విజువల్స్‌లో శ్రీరామ్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేయడం, ఫుడ్‌ ప్యాకేజీ తీసుకువచ్చిన సోనాపై కత్తితో దాడి చేయడం వంటి దృశ్యాలు రికార్డ్‌ అయ్యాయి. అయితే దాడి జరుగుతుండగా, ఆపబోయిన ఇతరులను కత్తితో బెదిరించి పారిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు

 


ఇవి కూడా చదవండి:

Blackmailed: మార్ఫింగ్‌ చేసిన వీడియోతో బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ.55 వేల దోపిడి

Hyderabad: హైదరాబాద్‌ పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు.. మూడు గంటల పాటు నడిరోడ్డుపై రభస

 

Follow Us