మంటల్లో 40 అంతస్థుల భవనం .. చైనాలో 14 మంది మృతి!

చైనాలోని ఎత్తైన భవనాలలో వరుస అగ్నిప్రమాదాలు కలవరపెడుతున్నాయి. తాజాగా తైయువాన్‌ లోని హై రైజ్ బిల్డింగ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు భవనంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించడంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 38 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఆసుపత్రులకు తరలించారు. చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా ఈ వివరాలను వెల్లడించింది.

మంటల్లో 40 అంతస్థుల భవనం .. చైనాలో 14 మంది మృతి!
Horror In China High Rise Building Fire Claims 14 Lives

Updated on: Nov 10, 2026 | 12:10 PM

చైనాలోని ఎత్తైన భవనాలలో వరుస అగ్నిప్రమాదాలు కలవరపెడుతున్నాయి. తాజాగా తైయువాన్‌ లోని హై రైజ్ బిల్డింగ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు భవనంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించడంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 38 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఆసుపత్రులకు తరలించారు. చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా ఈ వివరాలను వెల్లడించింది.

 

రెండు గంటలు పోరాటం

చైనాలోని ఉత్తర షాన్షీ ప్రావిన్స్‌ రాజధాని తైయువాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 40 అంతస్తుల ‘హావోషెంగ్ ఇంటర్నేషనల్ అపార్ట్‌మెంట్’ (Haosheng International Apartment) భవనంలో నివాస గృహాలు, హోటళ్లు, శిక్షణా కేంద్రాలు (tutoring centres) ఉన్నాయి. భవనం 4వ అంతస్తులో మంటలు ప్రారంభమై, వేగంగా 8, 9 అంతస్తుల్లో ఉన్న హోటల్ వరకు విస్తరించాయి. భవనం నుంచి భారీగా నల్లటి పొగ, మంటలు ఎగసిపడ్డాయి. రంగంలోకి దిగిన ఫైర్‌ఫైటర్లు భారీ క్రేన్లు, నిచ్చెనల సహాయంతో దాదాపు 60 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రమాదం జరిగిన రెండు గంటల్లో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భద్రతా లోపాలపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు, భవన మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ ప్రమాదంలో మొదట ఐదుగురు మరణించినట్లు ఆదివారం రాత్రి అధికారులు ప్రకటించారు. సోమవారం మృతుల సంఖ్య 14కి చేరింది.

 

హాంకాంగ్ విషాదం తర్వాత ఆగని అగ్నిప్రమాదాలు!

చైనాలో పదుల సంఖ్యలో అంతస్థులున్న ఎత్తైన భవనాల్లో అగ్నిప్రమాదాలు జరగడం భయాందోళనకు గురి చేస్తోంది. గత ఏడాది నవంబర్‌లో హాంకాంగ్‌లోని పలు హై రైజ్‌ బిల్డింగ్‌లకు మంటలు వ్యాపించిన ఘటనలో 168 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ తర్వాతి నెలలోనే దక్షిణ చైనా గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఓ నివాస సముదాయంలో 12 మంది మరణించారు. ఈ ఘటన తర్వాత ఎత్తైన భవనాల్లో అగ్నిప్రమాదాల ముప్పును తగ్గించేందుకు చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భవనాల్లో అగ్నిమాపక భద్రతా లోపాలను గుర్తించి సరిదిద్దే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఇప్పుడు తైయువాన్‌లో మరో 14 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఎత్తైన భవనాల్లో అగ్నిమాపక భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. భవనంలో మంటలు ఎలా చెలరేగాయి? భద్రతా ఏర్పాట్లలో లోపాలు కారణమా? దర్యాప్తు పూర్తయిన తర్వాతే ప్రమాదానికి అసలు కారణం తెలిసే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us