‘హలో ఫ్రమ్ ద మెలోడీ టీమ్’.. మళ్లీ నెట్టింట #Melodi ట్రెండ్.. మోదీ, మెలోనీ మరో సెల్ఫీ వైరల్‌

|

Jun 15, 2024 | 1:00 PM

గతంలో మాదిరి ఈసారి కూడా ప్రధాని మోదీ - ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని.. ప్రధాని మోదీతో సెల్ఫీ దిగి.. #Melodi ట్రెండ్ ను కొనసాగించారు. గత ఏడాది డిసెంబర్‌లో ఇంటర్నెట్‌లో వైరల్ అయిన #Melodi ట్రెండ్‌ను అనుసరించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఇటాలియన్ కౌంటర్ జార్జియా మెలోని G7 సమ్మిట్‌లో కొత్త సెల్ఫీకి పోజులిచ్చారు.

‘హలో ఫ్రమ్ ద మెలోడీ టీమ్’.. మళ్లీ నెట్టింట #Melodi ట్రెండ్.. మోదీ, మెలోనీ మరో సెల్ఫీ వైరల్‌
Giorgia Meloni - Narendra Modi
Follow us on

ఇటలీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీ7 దేశాల సదస్సులో పాల్గొన్న విషయం తెలిసింది.. ఇటలీలోని బోర్గో ఎగ్నాజియా ప్రాంతంలో జరిగిన జీ7 దేశాల సదస్సులో పాల్గొన్న మోదీ.. పలు దేశాల అధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.. ముందుగా ప్రధాని మోదీ – ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో భేటీ అయ్యారు. గతేడాది మెలోని భారత పర్యటన సందర్భంగా చర్చించిన అంశాల కొనసాగింపుగా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఇంధనం, రక్షణ, టెలికాం, మరిన్ని రంగాలలో భారతదేశం-ఇటలీ సంబంధాలను మరింత పటిష్టం చేసే మార్గాల గురించి చర్చించినట్లు మోదీ తెలిపారు. అయితే.. గతంలో మాదిరి ఈసారి కూడా ప్రధాని మోదీ – ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని.. ప్రధాని మోదీతో సెల్ఫీ దిగి.. #Melodi ట్రెండ్ ను కొనసాగించారు. గత ఏడాది డిసెంబర్‌లో ఇంటర్నెట్‌లో వైరల్ అయిన #Melodi ట్రెండ్‌ను అనుసరించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఇటాలియన్ కౌంటర్ జార్జియా మెలోని G7 సమ్మిట్‌లో కొత్త సెల్ఫీకి పోజులిచ్చారు. సమావేశాలు పూర్తయిన అనంతరం మోదీతో మెలోనీ సెల్ఫీ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇద్దరు నేతలు నవ్వుతూ సంతోషంగా సెల్ఫీ దిగారు. దీనికి సంబంధించిన వీడియోను జార్జియా మెలోని.. షేర్ చేసుకుంటూ.. Melodi (ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసేలా Giorgia Meloni – Narendra Modi) అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

వీడియో చూడండి..

గతేడాది (2023) డిసెంబర్లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌ వేదికగా జరిగిన ‘కాప్‌28’ సదస్సులో మోదీ, మెలోని సెల్ఫీ వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. మోదీతో తీసుకున్న సెల్ఫీని మెలోనీ ఎక్స్‌లో షేర్‌ చేసి #Melodi హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. ఆ ఫొటోపై ప్రధాని మోదీ కూడా స్పందిస్తూ.. స్నేహితుల్ని కలుసుకోవడం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుందంటూ రిప్లే ఇచ్చారు.. దీనికి కొనసాగింపుగా.. ఇప్పుడు మెలోని సెల్ఫీ షేర్ చేయగా.. నెట్టింట మళ్లీ ట్రెండ్ అవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..