కరోనాకు ఆ నాలుగు మందులు పనిచేయవు: డబ్ల్యూహెచ్‌ఓ

| Edited By:

Oct 17, 2020 | 4:18 PM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు ఇంతవరకు ఒక్క వ్యాక్సిన్ కూడా రాలేదు. వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు పలు దేశాల్లోని శాస్త్రవేత్తలు ట్రయల్స్ చేస్తూనే ఉన్నారు

కరోనాకు ఆ నాలుగు మందులు పనిచేయవు: డబ్ల్యూహెచ్‌ఓ
Follow us on

WHO on Re-Purposed Drugs: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు ఇంతవరకు ఒక్క వ్యాక్సిన్ కూడా రాలేదు. వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు పలు దేశాల్లోని శాస్త్రవేత్తలు ట్రయల్స్ చేస్తూనే ఉన్నారు. ఇక రష్యాకు చెందిన వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా.. దానిపై చాలా అనుమానాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు కరోనా సోకుతున్న రోగులకు, వైద్యులు అందుబాటులో ఉన్న డ్రగ్స్‌ని వాడుతున్నారు. ఇందులో రెమెడిసివర్, హైద్రాక్సీక్లోరోక్విన్‌, లోపినావిర్‌, ఇంటర్ఫెరాన్ల కాంబినేషన్లు ఉన్నాయి. దాదాపు 30కి పైగా దేశాల్లో వీటిని ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. అయితే ఇవన్నీ పనికిరావని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చేసింది.

ఈ నాలుగు డ్రగ్‌ల పనితీరు, వాటి ప్రభావంపై సాలిడారిటీ ట్రయల్ నిర్వహించింది. ఈ క్రమంలో కరోనా రోగులకు ఇచ్చే 28 రోజుల కోర్సులో ఇవి ఎలాంటి ప్రభావం చూపలేదని వెల్లడించింది. కాగా గిలియడ్‌, రెమెడిసివర్‌ డ్రగ్స్‌పై అమెరికా ఇటీవల ప్రయోగాలు చేయగా.. ప్లాసిబో తీసుకునే వారితో పోలీస్తే ఈ ఔషధాలు తీసుకున్న రోగులు త్వరగా కోలుకున్నట్లు తేలింది. అయితే రెండు సర్వేల్లో వేర్వేరు ఫలితాలు రాగా.. డబ్ల్యూహెచ్‌ఓ సాలిడారిటీ ట్రయల్స్‌పై విమర్శలు వస్తున్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ డేటా అస్థిరంగా ఉందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు దీనిపై స్పందించిన డబ్ల్యూహెచ్‌ఓ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌.. జూన్‌లో నిర్వహించిన అధ్యయనంలో హైడ్రాక్సోక్లోరోక్విన్‌, లోపినావిర్ పనికిరావని తేలిందని, అందుకే వాటిని నిలిపివేశామని అన్నారు.

Read More:

నితిన్ పవర్ పేటలో కీలక పాత్రలో సత్యదేవ్‌..!

డ్రగ్స్ కేసు: ప్రముఖ నటుడి భార్యకు సమన్లు.. విచారణకు గైర్హాజరు