Dalai Lama: భారత్‌కు దలైలామా చేయూత.. ట్విట్ చేసి వెల్లడించిన బౌద్ధగురువు.. ఏమన్నారంటే..?

|

Apr 28, 2021 | 8:25 AM

Dalai Lama Contributes To PM-CARES Fund: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తోంది. రోజూ లక్షలాది కేసులు వెలుగులోకి వస్తుండగా.. వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ తరుణంలో కరోనా

Dalai Lama: భారత్‌కు దలైలామా చేయూత.. ట్విట్ చేసి వెల్లడించిన బౌద్ధగురువు.. ఏమన్నారంటే..?
Dalai Lama
Follow us on

Dalai Lama Contributes To PM-CARES Fund: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తోంది. రోజూ లక్షలాది కేసులు వెలుగులోకి వస్తుండగా.. వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ తరుణంలో కరోనా మహమ్మారిపై పోరులో భారత్‌కు అండగా నిలిచేందుకు పలు దేశాలు ముందుకువస్తున్నాయి. ఆక్సిజన్, ఇతర ఔషధాలు లాంటివి భారత్‌కు అందిస్తున్నాయి. అయితే.. తాజాగా కరోనాతో ఇబ్బందులు పడుతున్న భారత్‌కు బాసటగా నిలిచేందుకు బౌద్ధ గురువు దలైలామా ముందుకొచ్చారు. తన ట్రస్ట్ ద్వారా భారత ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేసి వెల్లడించారు.

భారత్‌ సహా ప్రపంచమంతా కోవిడ్ మహమ్మారితో అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత సోదర, సోదరీమణులకు అండగా ఉండేందుకు పీఎం-కేర్స్‌ ఫండ్‌కు విరాళం ఇవ్వాలని ట్రస్ట్‌ను కోరాను. మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాల సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా ఫ్రంట్‌లైన్‌ సిబ్బందికి అభినందనలు. కొవిడ్‌ ముప్పు త్వరలోనే తొలగిపోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా.. అంటూ దలైలామా ట్విట్‌లో పేర్కొన్నారు.

దలైలామా ట్విట్..


ఇదిలాఉంటే.. కరోనాపై పోరులో ఇప్పటికే పలు దేశాలు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. అమెరికా, బ్రిటన్, రష్యా, తదితర దేశాలు ఏదో రకంగా ఆదుకుంటామని వెల్లడించాయి. అంతేకాకుండా పీపీఈ కిట్లు, ఆక్సిజన్ పరికరాలు, డ్రగ్స్ లాంటివి అందిస్తున్నాయి. ఈ క్రమంలో టెక్ కంపెనీలు, పలు వ్యాపార సంస్థలు సైతం భారత్‌కు సాయమందించి తమ ఉదారతను చాటుకుంటున్నాయి.

Also Read:

Covid-19: ఆ మందులతో కరోనా మరింత తీవ్రం.. అలాంటి రోగులందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఐసీఎంఆర్ హెచ్చరిక

Hospital Fire: థానేలోని ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. నలుగురు రోగుల సజీవ దహనం.. పలువురికి తీవ్ర గాయాలు