కరోనాను కట్టడి చేయడం అందుకే కష్టంగా మారింది

| Edited By:

Aug 11, 2020 | 8:50 AM

కరోనా సీజనల్‌గా వచ్చి పోయే వైరస్‌లా కనిపించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. అందుకే ఈ వైరస్‌ని కట్టడి చేయడం కష్టంగా మారిందని

కరోనాను కట్టడి చేయడం అందుకే కష్టంగా మారింది
Follow us on

WHO on Coronavirus: కరోనా సీజనల్‌గా వచ్చి పోయే వైరస్‌లా కనిపించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. అందుకే ఈ వైరస్‌ని కట్టడి చేయడం కష్టంగా మారిందని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర సేవల విభాగం డాక్టర్ మైఖేల్ రయాన్ వెల్లడించారు. ఈ వైరస్‌ ఏ సీజన్‌లో వస్తుందో చెప్పలేకపోతున్నామని అన్నారు. వేసవిలో కూడా కరోనా విజృంభిస్తోందని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ని ఎంత అణచివేయాలని చూసినప్పటికీ అది తిరిగి విజృంభిస్తూనే ఉందని రయాన్ తెలిపారు. ఇదిలా ఉంటే మరోవైపు కరోనా వైరస్ రూపాంతరం చెందుతున్నందున, ఏడాదికో వ్యాక్సిన్‌ తయారు చేయాల్సి ఉంటుందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే.

Read This Story Also: ఐసీయూగా మారిన షారూక్‌ ఆఫీస్‌.. కరోనా రోగులకు సేవలు అందించేలా