China Billionaire Missing : డ్రాగన్ పాలకుల తీరుపై విమర్శలు చేసి కోరి కష్టాలను తెచ్చుకున్న బిలియనీర్ అదృశ్యం..

|

Jan 04, 2021 | 5:11 PM

డ్రాగన్ కంట్రీ కంత్రీ పనులపై ఎవరైనా కామెంట్స్ చేయడం.. అక్కడ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలను కోవడం... కోరి కష్టాలను కొని తెచ్చుకోవడమే..

China Billionaire Missing : డ్రాగన్ పాలకుల తీరుపై విమర్శలు చేసి కోరి కష్టాలను తెచ్చుకున్న బిలియనీర్ అదృశ్యం..
Follow us on

China Billionaire Missing : డ్రాగన్ కంట్రీ కంత్రీ పనులపై ఎవరైనా కామెంట్స్ చేయడం.. అక్కడ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలను కోవడం… కోరి కష్టాలను కొని తెచ్చుకోవడమేనని అక్కడ కొంతమంది స్థానిక విద్యావేత్తలు, ప్రముఖులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. తాజాగా చైనా సర్కార్ కు సలహాలను ఇవ్వాలనుకున్న అలీబాబా వ్యవస్థాపకుడు చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. చైనా టెక్ బిలియనీర్ జాక్ మా .. ప్రభుత్వానికి ఆర్ధిక పరమైన సలహాలను ఇవ్వబోయి పాలకుల ఆగ్రహానికి గురైయ్యాడు. గత రెండు నెలలుగా బాహ్యప్రపంచానికి కనిపించడం లేదు. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

గత ఏడాది అక్టోబర్ లో షాంగైలో జరిగిన ఓ కార్యక్రమంలో చైనా సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను జాక్ మా తీవ్రంగా విమర్శించారు. ఆర్ధిక విధానాలోని లోపాలను, చైనీస్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాలను బహిరంగంగా ఎత్తిచూపారు. ఇకనైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి భవిష్యత్‌ తరాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త వ్యవస్థ గురించి ఆలోచించాలని హితవు పలికారు. దీంతో డ్రాగన్ ఆగ్రహానికి జాక్ మా గురయ్యారు. పాలకులు ఆయన సంస్థలపై ప్రతీకార చర్యలను చేపట్టింది. ఆయన్ని ఆర్ధికంగా దెబ్బకొట్టడానికి యాంటీ‌ ఫైనాన్షియల్‌ ఐపీవోతో అడ్డుకుంది. దీంతో ఆలీబాబా గ్రూప్‌ సంపదతో పాటు జాక్‌ మా ఆస్తులు కూడా కరిగిపోయాయి.

ఈనేపధ్యంలో నవంబరులో అలీబాబా సంస్థ నిర్వహిస్తున్న టాలెంట్‌ షో ఫైనల్‌కు చేరుకుంది. ఆఫ్రికాస్‌ బిజినెస్‌ హీరోస్ ఫైనల్ ఎపిసోడ్‌కు న్యాయనిర్ణేతగా జాక్ మా వ్యవహరించాల్సి ఉంది. అయితే ఆ షోకి ఆయన హాజరుకాలేదు. అప్పటి నుంచి ఆ బిలియనీర్ ఇప్పటి వరకూ ఎవరికీ కనిపించలేదు. దీంతో ఆయన ఎక్కడున్నారనేది మిస్టరీగా మారింది. భారత్ లో కూడా పేటియం మాల్స్, స్టారప్ జొమాటో, బిగ్ బాస్కెట్, స్నాప్ డీల్ వంటి అనేక సంస్థల్లో జాక్ మా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.. అయితే గత కొంత భారత్ , డ్రాగన్ కంట్రీ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈయన అదృశ్యం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Also Read: రైతుల కష్టాలను పట్టించుకోరా ? మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఫైర్, ఇది మొండి సర్కార్ అని వ్యాఖ్య 

Farmers Protest Live Updates: కేంద్రంతో ఏడో విడత చర్చలు.. భోజనం ఆరగిస్తున్న రైతులు…