కెనడాలో దారుణం.. 16 మంది మృతి.. 30ఏళ్ల చరిత్రలో తొలిసారి. !

| Edited By:

Apr 20, 2020 | 8:52 AM

ఓ వైపు కరోనాపై పోరాటం చేస్తుంటే.. మరోవైపు దుండగులు రెచ్చిపోతున్నారు. కెనడాలో ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 16 మంది మృతి చెందారు.

కెనడాలో దారుణం.. 16 మంది మృతి.. 30ఏళ్ల చరిత్రలో తొలిసారి. !
Follow us on

ఓ వైపు కరోనాపై పోరాటం చేస్తుంటే.. మరోవైపు దుండగులు రెచ్చిపోతున్నారు. కెనడాలో ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 16 మంది మృతి చెందారు. నోవా స్కోటియా రాష్ట్రంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మృతి చెందిన వారిలో ఓ మహిళా పోలీస్ కూడా ఉన్నారు. పోలీసుల కాల్పుల్లో దుండగులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇక ఆ ప్రాంతంలోని పలు భవానాలు కాలిఓగా.. వరుస ఘటనలతో పోలీసులు, స్థానిక యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ప్రజలు అసలు బయటకు రావొద్దని సూచించారు. ఇప్పటికే కెనడా కరోనా లాక్‌డౌన్‌ విధించగా.. అందరూ ఇళ్లలోనే ఉండాలని తెలిపారు.

దుండగుడు పోలీసుల దుస్తులను ధరించడంతో పాటు పోలీసులు వాడే వాహనంలానే కారును తయారుచేశాడని అధికారులు తెలిపారు. గత 30 ఏళ్ల కెనడా చరిత్రలో ఇలాంటి దారుణం జరగడం ఇదే తొలిసారని వారు వెల్లడించారు. కాగా 1989లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 14 మంది మృత్యువాతపడగా.. అప్పటి నుంచి దేశంలో తుపాకుల వాడకంపై కఠిన ఆంక్షలు విధించారు.

Read This Story Also: Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా వివరాలివే..!