దశాబ్దంగా సాగుతున్న కేసును ఛేదించిన 6 ఏళ్ల బుడతడు..!

| Edited By:

May 23, 2020 | 3:09 PM

6 ఏళ్ల పిల్లాడు.. దాదాపు దశాబ్దంగా సాగుతున్న కేసును ఛేదించాడు. ఏంటి..? ఆరేళ్ల పిల్లాడే..? కేసును ఛేదించడమే..? అనుకుంటున్నారా..!

దశాబ్దంగా సాగుతున్న కేసును ఛేదించిన 6 ఏళ్ల బుడతడు..!
Follow us on

6 ఏళ్ల పిల్లాడు.. దాదాపు దశాబ్దంగా సాగుతున్న కేసును ఛేదించాడు. ఏంటి..? ఆరేళ్ల పిల్లాడే..? కేసును ఛేదించడమే..? అనుకుంటున్నారా..! కానీ మీరు చదువుతున్నది నిజంగా నిజమండి. ఈ ఘటన అమెరికాలోని దక్షిణ కరోలియాలో జరిగింది.

కొన్నేళ్ల క్రితం కరోలియాలో భారీ దొంగతనం జరిగింది. ఓ కుటుంబానికి చెందిన విలువైన వస్తువులు, ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. దీనిపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. అయితే ఏళ్లు గడుస్తున్నా వారు దాన్ని ఛేదించలేకపోయారు. దీంతో వాటిపై ఆ ఇంటి సభ్యులతో పాటు పోలీసులు కూడా ఆశ వదిలేశారు.

ఇదిలా ఉంటే కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో బోర్‌గా ఉందని జాన్స్‌ ఐలాండ్‌కు చెందిన నాక్స్‌ బ్రేవర్‌ అనే కుర్రాడు కుటుంబ సభ్యులతో కలిసి విట్నీ సరస్సులో మాగ్నెట్ ఫిషింగ్‌(అయస్కాంత గాలంతో నీటిలో ఉన్న మెటల్ వస్తువులను బయటికి తీయడం)కు వెళ్లాడు. అక్కడ గాలం వేయగా.. నీళ్ల అడుగు భాగాన ఓ వస్తువు గాలానికి తగిలింది. అది బరువుగా ఉండటంతో ఎంత ప్రయత్నించినప్పటికీ.. బుడతడు దాన్ని బయటకు తీయలేకపోయాడు. ఇతరుల సహాయంతో మొత్తానికి ఓ పెట్టను బయటకు తీశారు. అది తెరిచి చూడగానే.. అందరి కళ్లు జిగేల్‌మన్నాయి. అందులో నగలు, ఖరీదైన వస్తువులు, క్రెడిట్‌ కార్డులు, చెక్ బుక్‌లు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ బుడతడు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ ఖజానాను పోగొట్టుకున్న మహిళను పిలిపించి అందజేశారు. ఈ సందర్భంగా ఆ మహిళ ఆ బుడతకి ధన్యవాదాలు తెలిపింది.

Read This Story Also: ఆమె వలనే మిహీకా పరిచయం.. లవ్‌ స్టోరీ బయటపెట్టిన రానా..!