ఆమె వలనే మిహీకా పరిచయం.. లవ్‌ స్టోరీ బయటపెట్టిన రానా..!

35 ఏళ్ల బ్యాచులర్ జీవితానికి త్వరలో రానా దగ్గుబాటి ముగింపు చెప్పబోతున్న విషయం తెలిసిందే. మొత్తానికి తన లవ్‌ను మిహీకా ఒప్పుకుందని ఆ మధ్యన సోషల్ మీడియాలో వెల్లడించిన రానా.

ఆమె వలనే మిహీకా పరిచయం.. లవ్‌ స్టోరీ బయటపెట్టిన రానా..!
Follow us

| Edited By:

Updated on: May 23, 2020 | 2:38 PM

35 ఏళ్ల బ్యాచులర్ జీవితానికి త్వరలో రానా దగ్గుబాటి ముగింపు చెప్పబోతున్న విషయం తెలిసిందే. మొత్తానికి తన లవ్‌ను మిహీకా ఒప్పుకుందని ఆ మధ్యన సోషల్ మీడియాలో వెల్లడించిన రానా.. తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు అభిమానులకు తెలిపారు. అంతేకాదు ఈ నెల 19న వీరిద్దరి రోకా వేడుక(ఉత్తరాదిన ఎక్కువగా జరుపుకునే వేడుక. ఈ వేడుకలో ఇరు కుటుంబాల పెద్దలు కలుసుకొని పెళ్లి గురించి మాట్లాడుకుంటారు) కూడా పూరైంది. ఇదిలా ఉంటే మిహీకా తనకు ఎలా పరిచయం అయ్యింది..? వారిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది..? అన్న ప్రశ్నలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమాధానాలిచ్చారు భల్లాలదేవ.

”మిహీకా, ఆశ్రిత(వెంకటేష్ పెద్ద కుమార్తె. గతేడాది ఈమెకు వివాహం జరిగింది) క్లాస్‌మేట్‌. చాలా రోజులుగా తను నాకు తెలుసు. మా ఇద్దరికి ఒకరి గురించి మరొకరికి బాగా తెలిసినప్పటికీ.. లాక్‌డౌన్‌ ముందు తమ బంధాన్ని ముందుకు తీసుకెళ్దామని భావించాం. మన జీవితంలో మనకు కరెక్ట్ అనిపించే వ్యక్తిని కలిసినప్పుడు ప్లోలో వెళ్తుంటాం. నా విషయంలోనూ అదే జరిగింది. మిహీకా గురించి నాన్న సురేష్‌ బాబు, అమ్మ లక్ష్మికి చెప్పినప్పుడు వారు ఎంతగానో సంతోషించారు. ఇదంతా ఒక రోజులోనే జరిగింది. ప్రస్తుతం అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మిహీకా పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే కానీ.. తనకు తెలుగు అంత సరిగా రాదు. పరిస్థితులు చక్కబడ్డ తరువాత పెళ్లి చేసుకుంటాం” అని రానా అన్నారు. కాగా మిహీకా ముంబయిలో ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తుండగా.. డ్యూ డ్రాప్ డిజైన్ పేరుతో ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అండ్ డెకార్ కంపెనీని కూడా నిర్వహిస్తోంది.

Read This Story Also:  ‘అవతార్​ 2’ షూటింగ్ షురూ…స్పెష‌ల్ సెట్ రెడీ..

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం