BIDEN PROPOSAL: ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదానికి బైడెన్ శాశ్వత పరిష్కారం.. కొత్త ప్రతిపాదన ఇదే!

|

May 22, 2021 | 1:16 PM

ఇజ్రాయెల్-పాలస్తీనా తీవ్రవాదుల మధ్య యుద్ధం ముగిసిన నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా శాశ్వత పరిష్కారంపై కీలక సూచనలు చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా పాత ప్రతిపాదనకే కొన్ని మార్పులతో తెరమీదికి తెచ్చారు.

BIDEN PROPOSAL: ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదానికి బైడెన్ శాశ్వత పరిష్కారం.. కొత్త ప్రతిపాదన ఇదే!
Follow us on

BIDEN PROPOSAL FOR ISRAEL PALESTINE ISSUE: 11 రోజుల పాటు ప్రపంచాన్ని కలవరానికి గురి చేసిన ఇజ్రాయెల్-పాలస్తీనా (ISRAEL-PALESTINE) తీవ్రవాదుల మధ్య యుద్ధం ముగిసిన నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా (AMERICA) శాశ్వత పరిష్కారంపై కీలక సూచనలు చేసింది. అమెరికా అధ్యక్షుడు (AMERICAN PRESIDENT) జో బైడెన్ (JOE BIDEN) తాజాగా పాత ప్రతిపాదనకే కొన్ని మార్పులతో తెరమీదికి తెచ్చారు. ఇజ్రాయెల్ (ISRAEL), పాలస్తీనా (PALESTINE) మధ్య ఉద్రిక్తతలు శాశ్వతంగా తొలగిపోయేందుకు తాను ప్రతిపాదిస్తున్న విధానం శాశ్వత శాంతికి దారి తీస్తుందని అమెరికన్ ప్రెసిడెంట్ అంటున్నారు. కాగా.. పదకొండురోజులపాటు కొనసాగిన దాడుల్లో తీవ్రంగా నష్టపోయిన గాజా సిటీ (GAZA CITY) పునరుద్ధరణకు అమెరికా పూర్తి స్థాయి సహాయమందిస్తామని బైడెన్ హామీ ఇచ్చారు.

అమెరికా అధ్యక్షుని తాజా ప్రతిపాదన ప్రకారం ఇజ్రాయెల్, పాలస్తీనా రెండు కూడా పూర్తి స్వతంత్ర, సార్వభౌమ దేశాలుగా మారాల్సి వుంటుంది. ఈ రెండు దేశాలకు జెరూసలేం (JARUSALEM)ను ఉమ్మడి రాజధాని (COMMAN CAPITAL)గా వుంటుంది. ఇదే ఏకైక, శాశ్వత శాంతి పరిష్కారమని బైడెన్ గట్టిగా వాదిస్తున్నారు. అలాగే జెరూసలేంలో ఇరు వర్గాల మధ్య కొనసాగుతున్న అంతర్గత ఘర్షణలు తక్షణమే ముగిసేలా చర్యలు తీసుకోవాలని బైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (BENJAMIN NETANYAHU)ను కోరారు. ఇజ్రాయెల్ భద్రతకు అమెరికా పూర్తిస్థాయిలో హామీ ఇస్తుందన్నారు. తాము సూచిస్తున్నట్లు రెండు సార్వభౌమ దేశాలుగా ఏర్పడినప్పటికీ.. భవిష్యత్తులోను ఇజ్రాయెల్ భద్రతకు అమెరికాదే బాధ్యత అని బైడెన్ అంటున్నారు. దీంట్లో ఎలాంటి మార్పు వుండదని హామీ ఇచ్చారాయన. నిస్సందేహంగా ఇజ్రాయెల్ ఉనికిని గుర్తిస్తే.. మిడిల్ ఈస్ట్‌ (MIDDLE EAST)లో శాంతి నెలకొంటుందని అమెరికా భావిస్తోంది.

నిజానికి ఈ ప్రతిపాదన కొత్తదేమీ కాదు.. కానీ బైడెన్ తనదైన శైలిలో పాత ప్రతిపాదనకు ఓ మార్పు చేసి తెరమీదికి తెచ్చారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి రెండు రాజ్యాల ప్రతిపాదనతో ముగింపు పలకవచ్చని అమెరికా విశ్వసిస్తోంది. ఈ ప్రతిపాదనపై గతంలో ట్రంప్ (TRUMP) ప్రభుత్వం భిన్నంగా వ్యవహరించడంతో తెరమరుగైంది. అప్పట్లో ట్రంప్ ఏకపక్షంగా ఇజ్రాయెల్‌కు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు. దాంతో అది తీవ్ర విమర్శలకు దారి తీసింది. అప్పట్లో ట్రంప్ సలహాదారుగా వ్యవహరించిన జేర్డ్ కుష్నర్ రెండు దేశాల ప్రతిపాదనకు అంగీకరిస్తూ ఓ బిల్లును తయారు చేశారు. ఆనాటి బిల్లులో పాలస్తీనాను స్వతంత్ర దేశంగా పేర్కొంటూనే దాని భద్రతను ఇజ్రాయెల్ చేతిలో పెట్టేలా ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదనను బెంజమిన్ నెతన్యాహూ స్వాగతించగా.. పాలస్తీనా నేతలు (PALESTINE LEADERS) గట్టిగా వ్యతిరేకించారు. తాజాగా బైడెన్ రెండు స్వతంత్ర దేశాలు.. కానీ ఉమ్మడి రాజధానిగా జెరూసలేం అంటూ ప్రతిపాదన తెరమీదకి తెచ్చారు. ఈ ప్రతిపాదనకు ఆ ఇజ్రాయెల్, పాలస్తీనా ఎలా స్పందిస్తాయో చూడాలి. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ స్పందన కూడా ఈ విషయంలో ఆసక్తి రేపే అంశమే.

మరోవైపు ఐక్య రాజ్య సమితి (UNITED NATIONS ORGANISATION) మానవ హక్కుల సమాఖ్య ఇజ్రాయెల్ వ్యవహారంపై దృష్టి సారించింది. ఇజ్రాయెల్ పాలస్తీనాలో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందన్న ఫిర్యాదుల మేరకు మే 27వ తేదీన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాఖ్య ప్రకటించింది. అయితే సమాఖ్యలో మొత్తం 47 సభ్య దేశాలుండగా.. వీటిలో కనీసం మూడో వంతు అంగీకరిస్తేనే మే 27వ తేదీన ప్రత్యేక సమావేశం జరిగే అవకాశం వుంది. తూర్పు జెరూసలేంతోపాటు ఇజ్రాయెల్ ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్లు సమాఖ్య ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. పాలస్తీనాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని యుఎన్ఓ (UNO) మానవ హక్కుల సమాఖ్య పాకిస్తాన్ (PAKISTAN) ముందుగా ఫిర్యాదు చేసింది. పాకిస్తాన్ ఇస్లామిక్ కోపరేషన్ సమన్వయకర్తగా ప్రస్తుతం వ్యవహరిస్తోంది. మూడో వంతు సభ్య దేశాలు అంగీకరిస్తే మే 27వ తేదీన జరగబోయే సమావేశం 30వ అసాధారణ సమావేశంగా చరిత్రలో మిగలబోతోంది. గత పదిహేనేళ్ళలో ఇలాంటి అసాధారణ సమావేశం జరగడం ఇదే తొలిసారి అవుతుంది. గాజాపై మే 19, 20 తేదీల్లో జరిగిన ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మానవ హక్కుల కౌన్సిల్ అసాధారణ సమావేశం ప్రతిపాదనకు తెరలేపింది. అయితే.. తాజాగా 11 రోజుల తర్వాత ఇజ్రాయెల్, పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ (HAMAS) మధ్య కాల్పుల విమరణ జరిగినందున ఈ అసాధారణ భేటీ జరుగుతుందా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. ఇక బైడెన్ చేసిన కొత్త ప్రతిపాదనపై కూడా ఐక్యరాజ్యసమితి స్పందన ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ALSO READ: రెండో డోసు ఎంత లేటైతే అంత మేలు.. అమెరికన్ సైంటిస్టుల తాజా అధ్యయనం ఫలితమిదే!