Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్లు.. సుప్రీంకోర్టును ముట్టడించిన విద్యార్ధులు.. చీఫ్‌ జస్టిస్‌ రాజీనామా..!

|

Aug 10, 2024 | 4:14 PM

బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఈసారి సుప్రీంకోర్టును టార్గెట్‌ చేశారు ఆందోళనకారులు. బంగ్లాదేశ్‌ చీఫ్‌ జస్టిస్‌ అబ్దుల్ హసన్‌ రాజీనామాకు విద్యార్ధులు పట్టుబట్టారు. సుప్రీంకోర్టును వందలాది మంది ఆందోళనకారులు ముట్టడించారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్లు.. సుప్రీంకోర్టును ముట్టడించిన విద్యార్ధులు.. చీఫ్‌ జస్టిస్‌ రాజీనామా..!
Bangaldesh Supreme Court
Follow us on

బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఈసారి సుప్రీంకోర్టును టార్గెట్‌ చేశారు ఆందోళనకారులు. బంగ్లాదేశ్‌ చీఫ్‌ జస్టిస్‌ అబ్దుల్ హసన్‌ రాజీనామాకు విద్యార్ధులు పట్టుబట్టారు. సుప్రీంకోర్టును వందలాది మంది ఆందోళనకారులు ముట్టడించారు. పోలీసులు వాళ్లను అడ్డుకున ప్రయత్నం చేశారు. చివరికి విద్యార్ధుల ఆందోళతో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అబ్దుల్‌ హసన్‌ తన పదవికి రాజీనామా చేశారు.

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌తో పాటు ఇతర న్యాయమూర్తులు కూడా త పదవులకు రాజీనామా చేశారు. షేక్‌ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకగా చెలరేగిన తిరుగుబాటులో 450 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. షేక్‌ హసీనా దేశం విడిచిపారిపోయారు. చీఫ్ జస్టిస్ అబ్దుల్‌ హసన్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు తొత్తుగా వ్యవహరించారని విద్యార్ధి సంఘాలు ఆరోపించాయి.

శనివారం (ఆగస్టు 10) వందలాది మంది నిరసనకారులు రాజధాని ఢాకాలోని సుప్రీంకోర్టు కాంప్లెక్స్‌ను చుట్టుముట్టారు. ఈ సమయంలో, ఆందోళనకారులు అప్పిలేట్ డివిజన్ చీఫ్ జస్టిస్ సహా ఇతర న్యాయమూర్తులకు మధ్యాహ్నం 1 గంటలోగా దిగిపోవాలని అల్టిమేటం జారీ చేశారు. నిరసనకారులు శనివారం సుప్రీంకోర్టును చుట్టుముట్టడంతో బంగ్లాదేశ్ ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ హసన్ తన పదవికి రాజీనామా చేశారు.

ఆయన రాజీనామా చేయకుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తి నివాసాలను ముట్టడిస్తామని ఆందోళనకారులు హెచ్చరించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఉన్న అత్యున్నత న్యాయస్థానం, దిగువ కోర్టుల న్యాయమూర్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తాను పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ప్రధాన న్యాయమూర్తి మీడియాకు తెలిపారు. తన రాజీనామాను అధ్యక్షుడు మహ్మద్‌ షహబుద్దీన్‌కు పంపుతానని చెప్పారు.

ఒబైదుల్ హసన్ విషయంలో అనేక వివాదాలు ఉన్నాయని తాత్కాలిక ప్రభుత్వ న్యాయ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ అన్నారు. అతను విదేశాలకు వెళ్లినప్పుడు, వివిధ అవామీ లీగ్ నాయకుల నివాసాలలో బస చేసినట్లు సమాచారం. తాత్కాలిక ప్రభుత్వ క్రీడా మంత్రిత్వ శాఖ సలహాదారు ఆసిఫ్ మహమూద్ కూడా చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ బేషరతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్తత మధ్య ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తుల సమావేశాన్ని వాయిదా వేసినట్లు సమాచారం.

కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రధాన న్యాయమూర్తి సంప్రదింపులు జరపకుండానే సమావేశం నిర్వహిస్తున్నారు. కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయమూర్తులు కుట్ర పన్నుతున్నారని, ఆగ్రహావేశాలు, జవాబుదారీతనం కోసం డిమాండ్లు లేవంటూ నిరసనకారులు ఆరోపించారు. ఆందోళనల మధ్య ప్రధాన న్యాయమూర్తి ఫుల్ కోర్టు సమావేశాన్ని వాయిదా వేశారు. శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో విద్యార్థులు, న్యాయవాదులు కోర్టును ముట్టడించారు. ఆ తర్వాత రాజీనామా చేయాలనే డిమాండ్ చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..