Employment: అక్కడ ఉద్యోగులు కావాలట.. మ్యాన్ పవర్ లేక ఎన్నో అవస్థలు.. మీరు వెళ్తే శాశ్వతంగా ఉండిపోవచ్చు..

|

Sep 03, 2022 | 9:40 AM

ఎక్కడ చూసినా నిరుద్యోగ సమస్యతో చాలా దేశాలు సతమతమవుతూ ఉంటాయి. జనాభాకు తగిన స్థాయిలో ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉద్యోగ ప్రకటన వెలువడితే చాలు లక్షలాది మంది..

Employment: అక్కడ ఉద్యోగులు కావాలట.. మ్యాన్ పవర్ లేక ఎన్నో అవస్థలు.. మీరు వెళ్తే శాశ్వతంగా ఉండిపోవచ్చు..
Jobs In Australia
Follow us on

Australia: ఎక్కడ చూసినా నిరుద్యోగ సమస్యతో చాలా దేశాలు సతమతమవుతూ ఉంటాయి. జనాభాకు తగిన స్థాయిలో ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉద్యోగ ప్రకటన వెలువడితే చాలు లక్షలాది మంది పోటీపడుతుంటారు. అదే భారత్ లో అయితే చిన్న ఉద్యోగానికి నోటిఫికేషన్ జారీ అయినా భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తాయి. ఇలా భారత్ ఒకటే కాదు.. ఎన్నో దేశాలు నిరుద్యోగ సమస్యతో నానా ఇబ్బందులు పడుతున్నాయి. కాని ఓ దేశంలో మాత్రం ఉద్యోగుల కొరత భారీగా ఉందట.. చాలా చోట్ల ఉద్యోగాలు చేయడానికి మ్యాన్ పవర్ లేక ప్రత్యామ్నాయాలపై ఆదేశం దృష్టిసారించింది. ఎవరైనా ఉద్యోగం చేసే వారుంటే వెంటనే ఆఫర్ లెటర్ కూడా ఇచ్చేస్తారట.. అక్కడ ఉద్యోగం చేసేందుకు ఇతర దేశాల వాళ్లను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టింది. ఇంతకీ అది ఏ దేశం అనుకుంటున్నారా.. అదేనండి ఆస్ట్రేలియా.. కంగారు దేశంలో ఉద్యోగుల కొరత భారీగా ఉంది. వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులు, కార్మికుల కొరతతో సతమతమవుతున్న ఆస్ట్రేలియా 2023 జూన్‌ 30తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనంగా 35వేల మందికి శాశ్వత వలస హోదాను ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఈ ఏడాది మొత్తం 1,95,000 మంది విదేశీయులు ఆస్ట్రేలియాకు శాశ్వతంగా వలస వచ్చి స్థిరపడగలుగుతారు. గత పదేళ్ల కాలంలో ఆస్ట్రేలియా శాశ్వత వలస వీసాల సంఖ్యను తొలిసారిగా పెంచింది.

ఆస్ట్రేలియాలో నిరుద్యోగం 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయింది. దీంతో ఖాళీగా ఉన్న 4,80,000 ఉద్యోగాలను భర్తీ చేసేవారు లేకుండా పోయారు. భారత్‌, చైనా, బ్రిటన్ల నుంచి ఆస్ట్రేలియాకు ఎక్కువమంది వలస వస్తుంటారు. వీరికి కఠినమైన ఆస్ట్రేలియా సరిహద్దు విధానాలు అడ్డుపడుతున్నాయని స్వయంగా ఆ దేశ హోం మంత్రి క్లేర్‌ ఓ నీల్‌ స్వయంగా వెల్లడించారు. కరోనా కారణంగా నర్సులకు తీవ్ర కొరత ఏర్పడటంతో ఆస్ట్రేలియా నర్సులు గడచిన రెండేళ్ల నుంచి రోజుకు రెండు.. మూడు షిఫ్టులు పనిచేయాల్సి వస్తోంది. విమానాశ్రయాల్లో తగినంతగా సిబ్బంది లేక విమాన ప్రయాణాలు ఆలస్యమైపోతున్నాయి. పండ్లు తెంపేవారు లేక చెట్ల మీదే రాలి పడిపోతున్నాయి. ప్రభుత్వం, పరిశ్రమలు, వ్యాపారాలు, కార్మిక సంఘాలకు చెందిన 140 మంది ప్రతినిధులతో గత రెండురోజుల పాటు జరిపిన సమావేశంలో క్లేర్‌ శాశ్వత వలస వీసాలను పెంచుతున్నట్లు ప్రకటించారు.

కొవిడ్‌ వల్ల రెండేళ్లపాటు సరిహద్దులను మూసివేయడం, విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లిపోవడం వల్ల ఆస్ట్రేలియా వ్యాపారాలు, పరిశ్రమలు సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచమంతటా ఉత్తమ ప్రతిభావంతులు జర్మనీ, కెనడా, బ్రిటన్లకు వెళుతున్నారు తప్ప ఆస్ట్రేలియాకు రావడం లేదని మంత్రి క్లేర్‌ ఓ నీల్‌ వ్యాఖ్యానించారు. అందుకే ఇతర దేశాలవారిని స్వాగతించడానికి శాశ్వత వలస వీసా విధానంలో మార్పులు అనివార్యమవుతున్నాయని ఆయన వెల్లడించారు. దీంతో ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఆస్ట్రేలియా అవకాశం కల్పిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి