Bomb Blasts: బస్సులపై ముష్కరుల బాంబు దాడి.. 9 మంది మృతి

|

Apr 29, 2022 | 12:35 PM

Bomb Blasts: వరుస బాంబ్ పేలుళ్లు ఆఫ్ఘనిస్తాన్‌‌ (Afghanistan)ను కుదిపేస్తున్నాయి. అఫ్గానిస్థాన్‌లో ఐఎస్‌ఐఎస్‌ (ISIS) తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉత్తర..

Bomb Blasts: బస్సులపై ముష్కరుల బాంబు దాడి.. 9 మంది మృతి
Follow us on

Bomb Blasts: వరుస బాంబ్ పేలుళ్లు ఆఫ్ఘనిస్తాన్‌‌ (Afghanistan)ను కుదిపేస్తున్నాయి. అఫ్గానిస్థాన్‌లో ఐఎస్‌ఐఎస్‌ (ISIS) తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉత్తర అఫ్గానిస్థాన్ లో గురువారం రాత్రి బస్సులో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. రెండు బాంబు పేలుళ్లలో 9 మంది మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని మజార్-ఇ-షరీఫ్‌ (Mazar-i-Sharif) లో రెండు మినీ బస్సులను లక్ష్యంగా చేసుకుని ఐఎస్‌ఐఎస్‌ ముష్కరులు పేలుళ్లు జరిపినట్లు తాలిబన్‌ అధికారులు వెల్లడించారు. షియాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన దాడికి తామే కారణమంటూ ఐఎస్‌ఐఎస్‌ (ISIS) ప్రకటించింది.

కాగా, గత వారం రోజుల కిందట మసీదు, మతపరమైన పాఠశాలలో జరిగిన బాంబు పేలుళ్లలో 33 మంది మృతి చెందగా, 43 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలా మంది విద్యార్థులు ఉన్నారు. ఇలాంటి దాడులు ఎక్కువగా ఐసీస్‌ చేస్తోంది. ఇలాంటి దాడులను అరికట్టేందుకు అక్కడి భద్రతా బలగాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఎక్కడో చోటు దాడులకు పాల్పడుతున్నారు. వీరి దాడుల కారణంగా అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. (Source)

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Ramya Murder Case: బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో విచారణ పూర్తి.. ఇవాళ కోర్టు తీర్పు

Mulugu Fire Accident: ములుగు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఊరంతా మంటలు.. ప్రజల హాహాకారాలు..!