Bomb Blast: మదర్సాలో భారీ పేలుడు.. 16 మంది మృతి.. 24 మందికి గాయాలు

|

Dec 01, 2022 | 6:59 AM

తాలిబన్ల పాలనలో చిక్కిన అఫ్గానిస్థాన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే ఓ స్త్రీల మీద ఆంక్షలు పెడుతూ, రాక్షస పాలన చేస్తుంటే మరోవైపు బాంబుల మోతతో ఆ దేశం దద్దరిల్లుతోంది. పిల్లలు, సాధారణ..

Bomb Blast: మదర్సాలో భారీ పేలుడు.. 16 మంది మృతి.. 24 మందికి గాయాలు
Bomb Blast
Follow us on

తాలిబన్ల పాలనలో చిక్కిన అఫ్గానిస్థాన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే ఓ స్త్రీల మీద ఆంక్షలు పెడుతూ, రాక్షస పాలన చేస్తుంటే మరోవైపు బాంబుల మోతతో ఆ దేశం దద్దరిల్లుతోంది. పిల్లలు, సాధారణ ప్రజలే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఓ మదర్సాలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 16 మంది మరణించారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనలో 24 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో మదర్సాలో విద్యను అభ్యసిస్తున్న పిల్లలే ఎక్కువగా ఉన్నారు. ఈ ఘటనపై ఇంకా తాలిబాన్ వర్గాలు స్పందించలేదు. ఈ ఘటనకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత ప్రకటించుకోలేదు. అయితే గత ఏడాది ఆగస్టులో అమెరికా వైదొలిగిన తర్వాత ఆఫ్ఘాన్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు.

వీరు అధికారం తీసుకున్నప్పటి నుంచి అక్కడ ఐసిస్ ఖొరాసన్ తీవ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడుతోంది. ఇప్పటి వరకు అక్కడ ఉన్న పలు మసీదుల్లో, సిక్కు ప్రార్థనా మందిరాలపై దాడులు చేసింది. ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. ముఖ్యంగా మైనారిటీలు అయిన షియాలు, ఖుర్దులనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. మరోవైపు తమ తలతిక్క నిర్ణయాలతో అఫ్ఘాన్ భవితను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు తాలిబన్లు. అక్కడ షరియా చట్టాలు తీసుకువచ్చి స్త్రీలకు హక్కులు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే స్త్రీలను చదువుకు దూరం చేశారు.

మరోవైపు.. పాకిస్తాన్‌లోని క్వెట్టాలో బుధవారం ఆత్మాహుతి బాంబు దాడులు జరిగాయి. ఈ పేలుడులో ముగ్గురు మరణించగా, 28 మంది గాయపడ్డారు. తామే దాడికి పాల్పడినట్టు తెహరీక్‌ తాలిబాన్‌ .. పాకిస్తాన్ తాలిబాన్ మిలిటెంట్ గ్రూప్, తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ ప్రకటించాయి. ఆత్మాహుతి పేలుడు సమయంలో పెట్రోలింగ్ పోలియో టీకా బృందానికి సెక్యూరిటీగా వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇస్లామిస్ట్ మిలిటెంట్లు తరచుగా పోలియో టీకా బృందాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. క్వెట్టా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దులో ఉన్న పాకిస్తాన్ ప్రావిన్స్ బలూచిస్తాన్ రాజధానిలో వేర్పాటువాద తిరుగుబాటు దారులు పనిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..